Central Cabinet: పాత పాన్‌ కార్డులన్నీ రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం..!

Central Cabinet Approves for PAN 2.0 Project Check Here for Full Details
x

Central Cabinet: పాత పాన్‌ కార్డులన్నీ రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం..!

Highlights

PAN 2.0 Project: ఆర్థిక లావాదేవీలకు పాన్‌ కార్డ్‌ ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ. 50 వేలు అంతకు మించి ట్రాన్సాక్షన్స్‌ చేయాలంటే కచ్చితంగా పాన్‌ ఉండాల్సిందే.

PAN 2.0 Project: ఆర్థిక లావాదేవీలకు పాన్‌ కార్డ్‌ ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ. 50 వేలు అంతకు మించి ట్రాన్సాక్షన్స్‌ చేయాలంటే కచ్చితంగా పాన్‌ ఉండాల్సిందే. ఇప్పటికే పాన్‌, ఆధార్‌ కార్డును లింక్‌ చేస్తూ కేంద్రం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పాన్‌ కార్డులన్నింటీన రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది.

ఇందుకు సంబంధించి సోమవారం కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పాన్‌ 2.0 పేరుతో తీసుకున్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పాత పాన్‌ కార్డుల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న కొత్త కార్డులు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులు ఈ కొత్త కార్డులను ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1435 కోట్లు ఖర్చు చేయనున్నారు. పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా ట్యాక్స్‌ చెల్లించే వారికి మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించనున్నారు. ఈ కార్డులో పాన్‌ సేవలతో పాటు పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్‌ సేవలను ఏకీకృతం చేయనున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి వైష్ణవ్‌ మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు దేశంలో 78 కోట్ల పాన్ కార్డ్‌లను ప్రజలకు పంపిణీ చేశాము. ఈ కొత్త ప్రాజెక్ట్ పన్ను చెల్లింపుదారులు ఉపయోగించే ప్రస్తుత వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయనుంది' అని తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ కేబినేట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.2750 కోట్లతో అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌, రూ.2481 కోట్లతో ‘ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్‌’, రూ.3,689 కోట్లతో అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రూ. 6000 కోట్లతో వన్‌ నేషన్‌-వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ పథకాన్ని తీసుకురానున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రముఖ యూనివర్సిటీల జర్నల్స్‌, పరిశోధనా పత్రాలు అందుబాటులో ఉండనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories