ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసిన ఆ 2 బ్యాంకులు.. అవేంటంటే..?

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసిన ఆ 2 బ్యాంకులు.. అవేంటంటే..?
x

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసిన ఆ 2 బ్యాంకులు.. అవేంటంటే..?

Highlights

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసిన ఆ 2 బ్యాంకులు.. అవేంటంటే..?

Central Bank UCO Bank: సామాన్య ప్రజలు సంపాదించిన సొమ్ముని అధిక వడ్డీ వచ్చే పెట్టుబడులలో ఇన్వెస్ట్‌ చేస్తారు. అందులో ముఖ్యమైనవి బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. సాధారణంగా చాలామంది ఇందులోనే పెట్టుబడి పెడుతారు. ఎందుకంటే ఇందులో అధిక వడ్డీతో పాటు, భద్రత కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు పడితే అప్పుడు విత్‌ డ్రా చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తారు. కానీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అనేవి వివిధ బ్యాంకులలో వివిధ రకాలుగా ఉంటాయి. తాజాగా రెండు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు చేసాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీస వడ్డీ రేటు 2.75 శాతం, గరిష్ట వడ్డీ రేటు 5.15 శాతం. 7 నుంచి 14 రోజులకు 2.75 శాతం, 15-30 రోజులకు 2.90 శాతం, 31-45 రోజులకు 2.90 శాతం, 46-90 రోజులకు 3.25 శాతం, 91-179 రోజులకు 3.80 శాతం ఉంటుంది. అలాగే 180-364 రోజులకు 4.25 శాతం, 2 సంవత్సరాల నుంచి1 సంవత్సరం లోపు వారికి 5 శాతం, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు వారికి 5.10 శాతం, 3-5 సంవత్సరాల లోపు వారికి 5.10 శాతం, 5-10 సంవత్సరాలకు 5.15 శాతం ఉంటుంది.

UCO బ్యాంక్ కనీస వడ్డీ రేటు 2.80 శాతం, గరిష్ట వడ్డీ రేటు 5.60 శాతం. 7నుంచి 29 రోజులకు 2.80 శాతం, 30-45 రోజులకు 3.05 శాతం, 46-90 రోజులకు 3.80 శాతం, 91-180 రోజులకు 3.95 శాతం, 181-364 రోజులకు 4.65 శాతం.1 సంవత్సరానికి 5.35 శాతం, 1-2 సంవత్సరాలకు 5.60 శాతం, 2-3 సంవత్సరాలకు 5.60 శాతం, 3-5 సంవత్సరాల కంటే తక్కువ వారికి 5.80 శాతం, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వారికి 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు కొత్త రేటు 4.05 శాతం నుంచి 6.55 శాతం వరకు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories