Women Schemes: కేంద్రం మహిళల కోసం ఈ స్కీమ్‌లను ప్రారంభించింది.. మీరు లబ్ధిపొందుతున్నారా..!

Center Has Launched These Schemes For Women Are You Benefiting
x

Women Schemes: కేంద్రం మహిళల కోసం ఈ స్కీమ్‌లను ప్రారంభించింది.. మీరు లబ్ధిపొందుతున్నారా..!

Highlights

Women Schemes: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలుచేస్తున్నాయి. వారికి స్వయం ఉపాధి కల్పించడానికి బ్యాంకుల ద్వారా సబ్సిడీలను అందిస్తున్నాయి.

Women Schemes: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలుచేస్తున్నాయి. వారికి స్వయం ఉపాధి కల్పించడానికి బ్యాంకుల ద్వారా సబ్సిడీలను అందిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. కానీ చాలామందికి వీటి గురించి తెలియదు. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు వీటిపై అవగాహన లేదు. అందుకే ఈ రోజు కొన్ని కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ల గురించి తెలుసుకుందాం.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం

మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ 2023 అనేది మహిళల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక పథకం. ప్రస్తుతం ఈ పథకంపై వడ్డీ 7.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. ఈ పథకంలో డబ్బును 2 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ప్రధానమంత్రి ఉజ్వల పథకం

మహిళల కోసం ఈ పథకం 1 మే 2016న ప్రారంభించారు. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన గృహిణులకు ఎల్‌పీజీ సిలిండర్లు అందజేస్తారు. ఇప్పటి వరకు దేశంలోని 8.3 కోట్ల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి.

బేటీ బచావో బేటీ పఢావో

బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని ప్రధానమంత్రి 22 జనవరి 2015న హర్యానాలో ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పఢావో పథకం లక్ష్యం బాలికల లింగ నిష్పత్తి క్షీణతను అరికట్టడం, మహిళలకు సాధికారత కల్పించడం.

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన

ఈ పథకం 10 అక్టోబర్ 2019న ప్రారంభించారు. ఈ పథకం కింద గర్భిణులు, నవజాత శిశువుల జీవిత భద్రత కోసం ప్రభుత్వం ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తోంది. తల్లులు, నవజాత శిశువుల మరణాలను నివారించడం ఈ పథకం లక్ష్యం. ఇవే కాకుండా మహిళా శక్తి కేంద్ర యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను కూడా నిర్వహిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories