Jeevan Jyothi: రోజుకు రూపాయిన్నర చెల్లిస్తే చాలు రూ. 2 లక్షల బీమా.. అర్హులు ఎవరంటే..!

By Investing RS 436 Yearly Get RS 2 Lakh Insurance, Check Here for Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana
x

Jeevan Jyothi: రోజుకు రూపాయిన్నర చెల్లిస్తే చాలు రూ. 2 లక్షల బీమా.. అర్హులు ఎవరంటే..!

Highlights

Jeevan Jyothi: ప్రస్తుతం జీవిత బీమాపై అందరిలోనూ అవగాహన పెరుగుతోంది.

Jeevan Jyothi: ప్రస్తుతం జీవిత బీమాపై అందరిలోనూ అవగాహన పెరుగుతోంది. అయితే సాధారణంగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనగానే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న అంశంగా భావిస్తుంటాం. అయితే పేదలకు కూడా జీవిత బీమా లభించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాన్ని తీసుకొచ్చింది. జీవన్‌ జ్యోతి బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అంత్యం తక్కువ ప్రీమియంతో ఏకంగా రూ. 2 లక్షల బీమా పొందొచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థికంగా వెనుకబడిన వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరాలనుకునే వారి వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రతీ ఏటా ఒకసారి ప్రీమియం చెల్లించాల్సిన ఉంటుంది. ఇక ప్రీమియం విషయానికొస్తే కేవలం రూ. 436 చెల్లించాల్సిందే. అంటే మీరు కేవలం నెలకు రూ. 40లోపే చెల్లిస్తారు. ఇంకా చెప్పాలంటే రోజుకు కేవలం రూపాయిన్నర కంటే తక్కువే ప్రీమియం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ ప్రీమియంతో రూ. 2 లక్షల బీమా మరే ఇతర పథకంలో ఉండదు.

ఇక ప్రతీ ఏటా మే 31వ తేదీ డబ్బు మీ అకౌంట్‌ నుంచి ఆటోమెటిక్‌గా డెబిట్ అవుతుంది. ఒక్కసారి చెల్లిస్తే ఆ ఏడాదికి మాత్రమే బీమా కవర్‌ అవుతుంది. ప్రతీ ఏటా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్‌ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ పాలసీ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రూ. 436 చెల్లించి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2015 మే 9వ తేదీ నుంచి ప్రారంభించింది. ప్రమాదవశాత్తు మరణిస్తేనే నామినీకి రూ. 2 లక్షలు చెల్లిస్తారు. ఈ పథకంలో చేరాలనుకునే వారు ఆన్ లైన్‌లో అప్లికేషన్‌ ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఆ తర్వాత ఫామ్‌ను ఫిలప్‌ చేయాలి. సంబంధిత డాక్యుమెంట్స్‌తో పాటు సమీపంలో ఉన్న బ్యాంకులో పథకంలో చేరొచ్చు. ఇందుకోసం మీ సేవింగ్స్‌ అకౌంట్‌ను లింక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories