Saving Scheme: రోజుకు రూ. 18 పొదుపు చేస్తే రూ. 3 ల‌క్ష‌లు పొందొచ్చు.. బెస్ట్ స్కీమ్‌..!

By investing RS 18 daily gets RS 3 lakhs post office offering bal jeevan scheme details
x

Saving Scheme: రోజుకు రూ. 18 పొదుపు చేస్తే రూ. 3 ల‌క్ష‌లు పొందొచ్చు.. బెస్ట్ స్కీమ్‌.. 

Highlights

Saving Scheme: రోజుకు రూ. 18 పొదుపు చేస్తే రూ. 3 ల‌క్ష‌లు పొందొచ్చు.. బెస్ట్ స్కీమ్‌..

Saving Scheme: భ‌విష్య‌త్తు అవ‌స‌రాల దృష్ట్యా పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఒక‌ప్పుడు సంపాదించిన దాంట్లో ఖ‌ర్చులు పోను సేవింగ్ చేసే వారు. కానీ సేవింగ్ చేసిన త‌ర్వాత మిగిలిన దాన్ని ఖ‌ర్చు చేయాల‌ని ప్ర‌స్తుతం ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్మును ఎందులో పెట్టుబ‌డిగా పెట్టాల‌ని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే వాటిపై ఆస‌క్తి చూపిస్తుంటారు. అలాంటి బెస్ట్ ప‌థ‌కాల‌ను అందించ‌డంలో ముందుంటుంది కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌.

నెల‌నెల త‌క్కువ మొత్తంలో పెట్టుబ‌డి పెట్టుకుంటూ పోతే మంచి ఆదాయం పొందే అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. అలాంటి ఓ బెస్ట్ స్కీమ్స్‌లో బాల్ జీవ‌న్ బీమా ప‌థ‌కం ఒక‌టి. ఇది జీవిత బీమాతో పాటు పొదుపు అకౌంట్‌లాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ప‌థ‌కంలో రోజుకు రూ. 6 చొప్పున పెట్టుబ‌డి పెట్టుకుంటూ మెచ్యూరిటీ త‌ర్వాత రూ. ల‌క్ష పొందొచ్చు. అదే ఒక‌వేళ రూ. 18 చొప్పున పెట్టుబ‌డి పెడితే రూ. 3 ల‌క్ష‌లు పొందొచ్చు.

ఒక‌వేళ ఇంట్లో ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటే.. రోజుకు రూ. 36 పొదుపు చేస్తే మెచ్యూరిటీ స‌మ‌యానికి ఏకంగా రూ. 6 ల‌క్ష‌లు పొందొచ్చు. అంటే నెల‌కు రూ. వెయ్యి సేవ్ చేయ‌డం ద్వారా రూ. 6 ల‌క్ష‌లు మీ సొంతమ‌వుతాయి. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టాలంటే చిన్నారుల వ‌య‌సు 5 నుంచి 20 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అలాగే త‌ల్లిదండ్రుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు. 5 నుంచి 20 సంవత్సరాల పిల్లల పేరుతో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఇది బీమా పాల‌సీ కాబ‌ట్టి ఒక‌వేళ మెచ్యూరిటీ కంటే ముందే పాల‌సీదారు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌రిణిస్తే, ప్రీమియం చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ పాల‌సీ మెచ్యూరిటీ పూర్త‌యిన త‌ర్వాత పిల్ల‌ల‌కు సంబంధించిన పూర్తి డ‌బ్బు నామినీకి ల‌భిస్తుంది. ఒక‌వేళ పాలసీ మధ్యలో నుంచి బయటికి రావాలనుకుంటే, ఐదు సంవత్సరాలు అనంతరం ఈ పాలసీని సరెండర్ చేయాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories