Post Office: నెలకు రూ. 7 వేలు జమ చేస్తే, రూ. 5 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. !

By investing monthly RS 7000 get RS 5 Lakhs rupees post office Recurring deposit scheme details
x

Post Office: నెలకు రూ. 7 వేలు జమ చేస్తే, రూ. 5 లక్షలు సొంతం చేసుకోవచ్చు..!

Highlights

Post Office: నెలకు రూ. 7 వేలు జమ చేస్తే, రూ. 5 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. !

Post Office: సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ భావిస్తుంటారు. వారి వారి ఆదాయాలకు అనుగుణంగా పొదుపు చేసుకుంటారు. అయితే పొదుపు చేసే క్రమంలో ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి ఆదాయం పొందాలని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే బ్యాంకులు, పోస్టాఫీస్‌లు పలు రకాల పథకాలను అందిస్తున్నాయి.

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బులకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్‌ కూడా పొందొచ్చు. ఇలా ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది పోస్టాఫీస్‌. ఇలాంటి వాటిలో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ఒకటి. ఈ పథకంలో నెలనెల పెట్టుబడి పెట్టుంటూ పోవోచ్చు. దీంతో మంచి ఆదాయం పొందొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి ఏకంగా రూ. 80 వేల వరకు వడ్డీ పొందొచ్చు.

ఉద్యోగులకు, నెల నెల ఫిక్స్‌డ్‌గా ఆదాయం వచ్చే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్‌ ద్వారా మీరు 6.7 శాతం వడ్డీ పొందొచ్చు. ఈ ఖాతాను మైనర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఈ పథకంలో నెలకు రూ. 7000 పెట్టుబడి పెడుతూ వెళ్లారని అనుకుందాం. దీంతో మీకు ఐదేళ్లలో మొత్తం రూ. 4,20,000 అవుతుంది. దీనిపై మీకు రూ. 79,564 వడ్డీ లభిస్తుంది. దీంతో వడ్డీతో కలుపుకొని మీకు ఐదేళ్లకు రూ. 4,99,564 లభిస్తుంది.

ఈ పథకంలో మీరు కనిష్టంగా రూ. 100 నుంచి గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఒకవేళ మీరు నెలనెలా రూ. 5000 డిపాజిట్‌ చేశారనుకుందాం, దీంతో మీరు ఏడాది రూ. 60,000 డిపాజిట్ చేస్తారు. ఐదేళ్లకు రూ. 3 లక్షలు అవుతుంది. దీనిపై మీకు రూ. 56,830 వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లకు మొత్తం రూ. 3,56,830 లభిస్తుంది. అయితే, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్‌డీ పథకం కింద వడ్డీపై టీడీఎస్‌ను కట్‌ చేస్తుంది. ఐటీఆర్‌ తర్వాత వీటిని రీఫండ్ చేసుకోవచ్చు. మీరు పదివేల కంటే ఎక్కువ వడ్డీ పొందితే మాత్రమే టీడీఎస్‌ కట్‌ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories