Life Insurance: మొదటిసారి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసుకోండి..!

Buying Life Insurance for the First Time Know These Benefits
x

Life Insurance: మొదటిసారి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసుకోండి..!

Highlights

Life Insurance: డబ్బులు పెట్టుబడి పెట్టడానికి మార్కెట్‌లో అనేక మార్గాలు ఉన్నాయి. అందులో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఒకటి.

Life Insurance: డబ్బులు పెట్టుబడి పెట్టడానికి మార్కెట్‌లో అనేక మార్గాలు ఉన్నాయి. అందులో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఒకటి. ఇది దీర్ఘకాలంలో మంచి రాబడులని అందిస్తుంది. ఇన్సూరెన్స్‌ చేయడం వల్ల ఒక వ్యక్తి అనేక ప్రయోజనాలు పొందుతాడు. తాను ఉన్నా లేకున్నా కుటుంబానికి ఎటువంటి నష్టం రాకుండా కాపాడుతాడు. వాస్తవానికి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. అయితే మొదటిసారి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేముందు ఈ విషయాలు తెలుసుకోండి.

పన్ను ప్రయోజనాలు

జీవిత బీమా ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలను పొందుతారు. బీమా పాలసీల ద్వారా రిటైర్‌మెంట్‌ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే కుటుంబానికి రక్షణ అందించవచ్చు. ఇందులో దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి రాబడిని పొందవచ్చు. సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ప్రజలు దీని ప్రయోజనాన్ని పొందుతారు.

ఆర్థిక భద్రత

జీవిత బీమా ద్వారా మరణ ప్రయోజనం లభిస్తుంది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే బీమా ద్వారా అందిన మొత్తం నామినీకి అందుతుంది. మరోవైపు బీమా పొందిన వ్యక్తి జీవించి ఉంటే అతను మెచ్యూరిటీ ప్రయోజనాన్ని పొందుతాడు. ఇది మంచి రాబడిగా ఉంటుంది.

పిల్లలకు మెరుగైన విద్య

పిల్లల ఉన్నత విద్య ఎప్పుడు ప్రారంభమవుతుందో అంచనా వేసి అందుకోసం మంచి లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవచ్చు. తద్వారా పిల్లలు మేజర్ అయినప్పుడు ఒకే మొత్తాన్ని పొందుతారు. ఉన్నత చదువుల కోసం వినియోగిస్తారు.

రిటైర్‌మెంట్ ప్లానింగ్

లైఫ్ ఇన్సూరెన్స్‌ను దీర్ఘకాలికంగా తీసుకుంటే చాలా లాభాలు పొందుతారు. అవసరమనుకుంటే రిటైర్మెంట్‌ ప్లాన్‌ కూడా చేసుకోవచ్చు. జీవిత బీమా సంస్థలు అలాంటి పాలసీలని కూడా రూపొందించాయి. వీటి ద్వారా జీవిత చరమాంకంలో ఎవరిపై ఆధారపడకుండా జీవించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories