Business Plan: ఈ ఔషధ మొక్క ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించండి..!

Business Plan: ఈ ఔషధ మొక్క ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించండి..!
x
Highlights

Business Plan: ఈ ఔషధ మొక్క ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించండి..!

Business Plan: కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ రోజుల్లో ప్రజలు ఆయుర్వేద మందులు, ఔషధాలను ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు. దీని కారణంగా ఔషధ గుణాలు కలిగిన వస్తువులు, మొక్కల మార్కెట్ వేగంగా పెరిగింది. ఈ పరిస్థితిలో ఔషధ మొక్కల వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మీరు ఉద్యోగంతో పాటు లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే నల్ల పసుపు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

నల్ల పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మార్కెట్లో లభించే అత్యంత ఖరీదైన ఉత్పత్తులలో ఒకటి. నల్ల పసుపును అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది హోమియోపతి, ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మీరు కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని విషయాలను తెలుసుకోవడం ముఖ్యం.

నలుపు పసుపు సాధారణ పసుపు లాగా కనిపిస్తుంది. కానీ మధ్యలో పసుపు చారలకు బదులుగా నలుపు లేదా ఊదా రంగు చారలను కలిగి ఉంటుంది. నల్ల పసుపు సాగుకు ఉత్తమ సమయం జూన్‌గా పరిగణిస్తారు. ఈ సాగులో ప్రత్యేకత ఏంటంటే ఈ మొక్కను ఒక్కసారి పొలంలో నాటితే పెద్దగా పట్టించుకోనవసరం లేదు. దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. వర్షపు నీటితో మాత్రమే పెరుగుతుంది. పసుపు బాగా పెరగడానికి మీరు ఆవు పేడ వంటి సహజ ఎరువులు ఉపయోగించవచ్చు.

దీనివల్ల మొక్క వేగంగా పెరుగుతుంది. నల్ల పసుపు సాగు చేయడానికి ఒక ఎకరం భూమిలో ఒక క్వింటాల్ విత్తనం అవసరం పడుతుంది. ఒక ఎకరం భూమిలో కనీసం 15 క్వింటాళ్ల పసుపును సులభంగా పండించవచ్చు. మీరు కనీసం 7 నుంచి 8 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించవచ్చు. నల్ల పసుపును నేరుగా ఫార్మాస్యూటికల్ కంపెనీకి అమ్మవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories