Business Ideas: ఉన్న ఊరిలోనే కేవలం 5 లక్షల పెట్టుబడి పెడితే చాలు.. నెలకు రూ. 2 లక్షలు సంపాదించడం పక్కా

Business Ideas 2024 With Ganuga oil you can earn lakhs of income
x

Business Ideas: ఉన్న ఊరిలోనే కేవలం 5 లక్షల పెట్టుబడి పెడితే చాలు.. నెలకు రూ. 2 లక్షలు సంపాదించడం పక్కా

Highlights

Business Ideas 2024: మీరు ఉన్న ఊరిలోనే వ్యాపారం చేసి రాణించాలి.. అనుకుంటున్నారా.. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అనేవి చాలా తక్కువగా లభిస్తూ ఉంటాయి.. వ్యవసాయ సంబంధిత వ్యాపార అవకాశాలు తప్ప ఇతర వ్యాపారాలకు పెద్దగా ఆస్కారం ఉండదు. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా విస్తరించిన ఈ రోజుల్లో మీరు ఏ ప్రదేశం లో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం మనం ఒక చక్కటి వ్యాపారం గురించి తెలుసుకుందాం.

ఈ వ్యాపారం మన సాంప్రదాయ ఆరోగ్యకరమైన వ్యాపారం అదే గానుగ నూనె బట్టి. ఒకప్పుడు పాత రోజుల్లో ఎద్దులను గానుగకు కట్టి తిప్పుతూ మధ్యలో నువ్వులు, వేరుశనగ, కుసుమలు వేసి నెమ్మదిగా రుబ్బుతూ గానుగ ఆడిస్తూ ఎద్దులు తిరుగుతూ ఉంటే మధ్యలో ఉన్న విత్తనాల నుంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్ సేకరించేవారు. ఇది అత్యంత ఆరోగ్యకరమైనటువంటి నూనె తీసే పద్ధతి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది 100% ఆర్గానిక్ పద్ధతిలో నూనెను తీయడం అని చెప్పవచ్చు. పాత రోజుల్లో ఈ గానుగలను నిర్వహించడానికి ఒక ప్రత్యేక కులం సైతం ఉండేది. ప్రస్తుతం ఆయా కులస్తులు ఆయిల్ మిల్లులు వచ్చిన అనంతరం తమ సాంప్రదాయ వృత్తిని వదిలేసి ఇతర రంగాలకు వలస వెళ్లిపోయారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో కోడ్ ప్రెస్ ఆయిల్స్ వినియోగిస్తే మంచిదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆయిల్ మిల్లులో తీసే నూనెలో రసాయనాలు కలుపుతారని వాటిలో ఎలాంటి పోషకాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాత పద్ధతుల్లో చెక్క గానుగలను ఆడించి తీసిన నూనెలో పూర్తిస్థాయిలో పోషకాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో మరోసారి చెక్క గానుగలకు డిమాండ్ పెరిగింది. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.

ఈ చెక్క గానుగ ఏర్పాటుకు కనీసం ఐదు లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే గానుగ ఆడించడానికి ఎద్దులు అవసరం అవుతాయి. తద్వారా మీరు పశుపోషణ కూడా చేపట్టవచ్చు. గానుగ ఎద్దుల కోసం ఒంగోలు జాతికి చెందినవైతే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. గానుగ నూనె ఉత్పత్తి కోసం మీరు పాతకాలం నాటి ఎద్దులు ఆడించే గానుగతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోల్డ్ ప్లస్ ఆయిల్ మిషన్లను కూడా కొనుగోలు చేసుకున్నట్లయితే, నూనె ఉత్పత్తి అనేది పెరుగుతుంది.

తద్వారా మీరు పెద్ద మొత్తంలో మార్కెట్కు తగ్గట్టు విక్రయించవచ్చు. అయితే మీరు గానుగ మిల్లును ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా స్థానికంగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా నూనె బ్రాండింగ్ కోసం మీరు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించుకోవాలి. దీంతోపాటు జీఎస్టీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ సెక్యూరిటీ నియంత్రణ సంస్థల నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్లయితే, మీ వ్యాపారం సాఫీగా సాగించుకోవచ్చు. ప్యాకింగ్ కోసం మరో యంత్రం ప్రత్యేకంగా పెట్టుకున్నట్లైతే మీ పని సులువు అవుతుంది.

మార్కెట్లో అందుబాటులో ఉన్న నూనెల కన్నా కూడా ఈ ఆర్గానిక్ ఆయిల్స్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల స్పృహ ఉన్నవారు వీటిని వాడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కనుక మీరు ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మీ కస్టమర్లను నేరుగా పొందవచ్చు. తద్వారా వారికి హోమ్ డెలివరీ చేయడం ద్వారా మీకు పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories