ఉద్యోగులకి బంపర్‌ ఆఫర్‌.. బడ్జెట్‌ తర్వాత జీతాలు పెరిగే అవకాశం..!

Bumper Offer to Employees Possibility of Salary Increase After the Budget 2023
x

ఉద్యోగులకి బంపర్‌ ఆఫర్‌.. బడ్జెట్‌ తర్వాత జీతాలు పెరిగే అవకాశం..!

Highlights

7th Pay commision: ఈ ఏడాది బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2023న సమర్పించనున్నారు.

7th Pay commision: ఈ ఏడాది బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2023న సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఉద్యోగులు, గృహిణులు, విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు దేశంలోని సాధారణ ప్రజల అంచనాలు, ఆకాంక్షల భారం ఉంది. పన్నుల విషయంలో ఆర్థిక మంత్రి ప్రజలకు ఎంత ఉపశమనం కలిగించగలరో బడ్జెట్ రోజునే తెలుస్తుంది కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఒక వార్తే నిజమైతే వారి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

ఫిట్‌మెంట్ విషయంలో మార్పు

దేశంలో జరుగుతున్న వివిధ మీడియా కథనాలను విశ్వసిస్తే ఈ బడ్జెట్‌లో కేంద్ర ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచుతుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రభుత్వోద్యోగుల జీతం నేరుగా 8000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచితే దీని ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000కు పెరగనుంది. జీతంలో ప్రత్యక్షంగా 8000 రూపాయల పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్

ప్రస్తుతం 2.57 శాతంగా ఉన్న ప్రస్తుత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ రేటు 3.68 శాతానికి పెరగనుంది. ఇది ఉద్యోగుల బేసిక్‌ సాలరీని పెంచుతుంది. ఒక ఉద్యోగి బేసిక్‌ వేతనం రూ.15,500 అనుకుంటే 4200 గ్రేడ్ పే ప్రకారం అతని మొత్తం జీతం 15,500×2.57 లేదా మొత్తం రూ.39,835 అవుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ పెంచింది. దీంతో దేశంలోని అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌లో కూడా పెరుగుదల కనిపించింది. అయితే ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ పెంపు వల్ల ఉద్యోగులకు మరిన్ని లాభాలు వస్తాయని అందరు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories