Blue Aadhaar: బ్లూ ఆధార్ ప్రయోజనాలేంటి.. ఎలా పొందాలో తెలుసుకోండి..!

Blue Aadhaar Card is Given to Children Below Five Years of age Know how to get it
x

Blue Aadhaar: బ్లూ ఆధార్ ప్రయోజనాలేంటి.. ఎలా పొందాలో తెలుసుకోండి..!

Highlights

Blue Aadhaar: నేటి కాలంలో ఆధార్ అనేది పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా చాలా ముఖ్యమైన పత్రంగా మారింది.

Blue Aadhaar: నేటి కాలంలో ఆధార్ అనేది పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా చాలా ముఖ్యమైన పత్రంగా మారింది. స్కూల్ అడ్మిషన్‌ సమయంలో ఈ కార్డ్ ఖచ్చితంగా అవసరం. అందుకే నవజాత శిశువులకి కూడా ఆధార్ కార్డు ప్రవేశపెట్టారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అందించే ఆధార్ కార్డును బ్లూ ఆధార్ కార్డ్ అంటారు. ఇది లేకుంటే పిల్లలు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ కార్డు ఎలా పొందాలో తెలుసుకుందాం.

UIDAI ఆధార్ జారీ చేసే సంస్థ. బ్లూ ఆధార్‌ కోసం ముందుగా ఏదైనా ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఇక్కడ బ్లూ ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది సాధారణ ఆధార్ కార్డు మాదిరిగానే ఉంటుంది. ఇందులో పిల్లల పేరు, వయస్సు, ఫోటో, చిరునామా తదితర వివరాలు ఉంటాయి. పిల్లల బయోమెట్రిక్ సమాచారం ఉండదు కానీ పిల్లలకి 5 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఈ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.

ఈ ఆధార్‌ కార్డు పొందడానికి ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను నింపి ఆధార్ కేంద్రంలో సమర్పించాలి. దీంతో పాటు కొన్ని అవసరమైన పత్రాలను జతచేయాలి. పిల్లల జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, ఆసుపత్రి డిశ్చార్జ్ సర్టిఫికేట్, విద్యుత్ బిల్లు వంటివి అవసరమవుతాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆధార్‌ కేంద్రం ఒక స్లిప్‌ని అందిస్తుంది. దీంతో మీరు ఆన్‌లైన్‌లో ఆధార్ స్టేటస్‌ని చెక్ చేయవచ్చు. కొద్ది రోజుల్లోనే బ్లూ ఆధార్ మీ ఇంటికి చేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories