Blinkit: బ్లింకిట్ సరికొత్త సేవలు..పది నిమిషాల్లోనే అంబులెన్స్
Blinkit: పది నిమిషాల్లోనే కిరాణా సరుకులు డెలివరీ చేస్తున్న క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ ఇప్పుడు సరికొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. కేవలం పది...
Blinkit: పది నిమిషాల్లోనే కిరాణా సరుకులు డెలివరీ చేస్తున్న క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ ఇప్పుడు సరికొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. కేవలం పది నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చేలా బ్లింకిట్ అంబులెన్స్ సేవలను గురువారం ప్రారంభించింది. తొలిదశలో గురుగ్రామ్ లో ఐదు అంబులెన్స్లతో ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ అల్బీందర్ దిండ్సా వెల్లడించారు. ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో అంబులెన్స్ వరకు సంబంధించిన మరిన్ని వివరాలను షేర్ చేశారు.
మన నగరాలలో వేగమంతమైన నమ్మకమైన అంబులెన్స్ సేవలను అందించే దిశగా అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభిస్తున్నట్లు దిండ్సా పేర్కొన్నారు. దీనిలో భాగంగానే గురుగ్రాంలో ఐదు అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తరించినట్లు వెల్లడించారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ కలిగిన ఈ అంబులెన్స్లను బ్లింకిట్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్, స్ట్రక్చర్ మానిటర్, సెక్షన్ మెషిన్, అత్యవసర మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు
Ambulance in 10 minutes.
— Albinder Dhindsa (@albinder) January 2, 2025
We are taking our first step towards solving the problem of providing quick and reliable ambulance service in our cities. The first five ambulances will be on the road in Gurugram starting today. As we expand the service to more areas, you will start… pic.twitter.com/N8i9KJfq4z
ఒక్కో అంబులెన్స్ లో పారామెడికో, ఒక సహాయకారి, డ్రైవర్ ఉంటారని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో రోగులకు వీరు సేవలందిస్తారు అని ఆయన తెలిపారు. లాభార్జన తమముఖ్య ఉద్దేశం కాదని కస్టమర్లకు అందుబాటు ధరలో అంబులెన్స్ అందించడం తమ అంతిమ లక్ష్యం అని వివరించారు. రాబోయే రెండేళ్లలో అన్ని ప్రధాన నగరాలకు ఈ సర్వీస్ లను విస్తరించాలనుకున్నట్లు తెలిపారు. బ్లింకిట్ ఆలోచనపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మంచి ఆలోచన అంటూ కొనియాడుతున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire