Biryani: ఆన్‌లైన్ ఆర్డర్‌లో బిర్యానీదే టాప్ ప్లేస్.. నిమిషానికి..

Biryani Most Ordered Dish in Swiggy 2022
x

Biryani: ఆన్‌లైన్ ఆర్డర్‌లో బిర్యానీదే టాప్ ప్లేస్.. నిమిషానికి..

Highlights

Biryani: ఆన్‌లైన్ ఆర్డర్‌లో బిర్యానీదే టాప్ ప్లేస్.. నిమిషానికి..

Biryani: ఏ ఇద్దరు ‌ఫ్రెండ్స్ మీట్ అయినా.. పెళ్లి అయినా ఫంక్షన్ అయినా మస్ట్‌ ఫుడ్ ఐటెమ్ బిర్యానీనే.. అంతెందుకు సెలబ్రెటీలు అయినా.. పొలిటీషియన్స్ అయినా ఫేవరేట్ ఫుడ్ లిస్ట్‌లో బిర్యానీ ఉండాల్సిందే. మసాలాలు దట్టించి, కుంకుమ పూల పాలను గుమ్మరించి, లేత మాంసంతో తయారయ్యే టేస్టీ టేస్టీ బిర్యానీ లేకపోతే ముద్ద దిగదంటున్నారు ఫుడ్ లవర్స్. ప్లేస్ ఏదయినా.. ఫుడ్ ఐటెమ్స్ ఎన్ని ఉన్నా.. బిర్యానీ తినకపోతే మనసు కుదురుగా ఉండటం లేదట. అందుకే రెస్టారెంట్స్‌లోనే కాదు.. ఆన్‌లైన్‌ ఆర్డర్లలోనూ బిర్యానీనే టాప్ ప్లేస్‌లో మరోసారి సెటిల్ అయిపోయింది.

బిర్యానీ పేరు వినగానే చాలామందికి హైదరాబాద్ ధమ్ బిర్యానీనే గుర్తుకువస్తుంది. ఆ వెంటనే మైండ్‌లో వైబ్రేషన్స్‌ స్టార్టయి నాలుక జివ్వుమంటూ బిర్యానీ వైపు మనసు లాగేస్తుంది. చూడగానే కాదు..కాదు. తలచుకోగానే నోరూరించే రుచి, రంగు, ఆ ఘుమఘుమలు వెంటనే బిర్యానీ తినాలన్న క్రేవింగ్స్‌ను పెంచేస్తాయి. అందుకే ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా.. కాస్ట్లీ హోటల్‌కు వెళ్లినా అక్కడ మెయిన్ కోర్సుగా బిర్యానీనే ఉంటుంది. బిర్యానీ లవర్సే కాదు.. వరల్డ్ వైడ్‌గా ఉన్న ఫుడ్ లవర్స్ అంతా ది బెస్ట్ బిర్యానీ అంటూ హైదరాబాద్ బిర్యానీకి కితాబిచ్చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా 80 రకాల బిర్యానీలు ఉన్నా.. భాగ్యనగరపు ధమ్ బిర్యానీకి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అంటుంటారు హైదరాబాదీలు. అందుకే హైదరాబాద్‌కు ఏ సెలబ్రెటీ వచ్చినా బిర్యానీ టేస్ట్ చేయకుండా ట్రిప్ కంప్లీట్ అవ్వనట్లే ఫీలవుతుంటారు.

ఎక్కువమందిలో మీ ఫేవరేట్ ఫుడ్ ఏంటి అంటే.. అందులో సగం మంది కన్నా ఎక్కువ చెప్పేది బిర్యానీనే. ఆ వాసనకే నోరూరిపోతుందని.. తింటే స్వర్గమే గుర్తొస్తుందని గుటకలు మింగుతూ మరీ చెబుతారు. బెస్ట్ మసాలా దినుసులు, కుంకుమ పాలు, లేత మాంసంతో పొరలు పొరలుగా వేస్తూ వండే దమ్ బిర్యానీ.. రుచి మరిచిపోవడం అంత ఈజీ కాదంటారు. నిజానికి బిర్యానీ మన వంటకం కాదు.. పెర్షియన్ సంస్కృతి నుంచి మనకి పాకిన పురాతన రెసిపీ. మొఘలుల మన దేశానికి వచ్చి మనకి ఇచ్చిన అద్భుత బహుమతి బిర్యానీ అని చెప్పుకోవచ్చు. ప్రతి వారం, వీలైతే ప్రతి రోజూ బిర్యానీ తినే వాళ్లు ఉన్నారు. ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ మరోసారి బిర్యానీని ఈ సంవత్సరంలో "అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం"గా ప్రకటించింది. తమ వార్షిక ట్రెండ్స్‌కు సంబంధించిన నివేదిక హౌ ఇండియా స్విగ్గీ 2022 ఎడిషన్లో ఈ వార్తను ప్రచురించింది.

నిజంగానే బిర్యానీ తన దమ్ము చూపిస్తోంది. ఏకంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయంటే సెకనుకు 2.28 ఆర్డర్లు అంటూ ఆ నివేదికలో రాసుకొచ్చింది. అంటే ఏ స్థాయిలో బిర్యానీ అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం స్విగ్గీలోనే ఇలా అమ్ముడుపోతుంటే ఇక జొమాటో వంటి ఇతర ఫుడ్ అగ్రిగేటర్లలోని అమ్మకాలు చూస్తే బిర్యానీ ఇంకా ఎక్కువగానే అమ్ముడవుతున్నట్టే లెక్క. బిర్యానీ తరువాత అధికంగా అమ్ముడవుతున్న అయిదు వంటకాలు ఏమిటో కూడా ప్రకటించింది స్విగ్గీ. మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో తినేవి మినహాయిస్తే స్నాక్స్ టైమ్‌లో అధికంగా అమ్ముడవుతున్నది సమోసాలు. స్విగ్గీలో ఈ ఏడాది దాదాపు 40 లక్షల సమోసా ఆర్డర్లు వచ్చినట్టు చెప్పింది స్విగ్గీ. తరువాత 22 లక్షల దాకా పాప్ కార్న్ ఆర్డర్లు వచ్చాయి. అయితే ఈ రెండింటి ఆర్డర్ కూడా రాత్రి పదిగంటల తరువాత వచ్చాయని స్విగ్గీ కన్ఫమ్ చేసింది. అలాగే తీపి పదార్థాలలో గులాబ్ జామూన్ ఎక్కువగా ఆర్డర్లు అందుకుంది. తరువాత రసమలై, చాకో లావా కేక్‌లు ఉన్నాయి. ఆర్డర్లలో చికెన్ ఐటెమ్ష్ ఎక్కువగా వచ్చినట్టు చెప్పింది స్విగ్గీ. దాదాపు 29.86 లక్షల ఆర్డర్లు చికెన్‌కు సంబంధించినవే.

Show Full Article
Print Article
Next Story
More Stories