Alert: ఎస్బీఐ ఖాతాదారులకి అలర్ట్‌.. ఈ విషయంపై జాగ్రత్త..!

Beware of this Message Coming in the Name of State Bank If you Respond you will Lose a lot
x

Alert: ఎస్బీఐ ఖాతాదారులకి అలర్ట్‌.. ఈ విషయంపై జాగ్రత్త..!

Highlights

Alert: ఇటీవల ఆన్‌లైన్‌ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మోసాలు మెస్సేజ్‌ల ద్వారా జరుగుతున్నాయి.

Alert: ఇటీవల ఆన్‌లైన్‌ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మోసాలు మెస్సేజ్‌ల ద్వారా జరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మోసం ఒకటి తెరపైకి వచ్చింది. ఈ స్కామ్‌లో ఎస్బీఐ వినియోగదారులకు ఒక మెస్సేజ్‌ వస్తోంది. దీనికి రెస్పాండ్‌ అవడం చాలా ప్రమాదకరం. దీని కారణంగా మీరు మీ ఖాతాలోని మొత్తం డబ్బును కోల్పోవచ్చు. వైరల్‌ అవుతున్న ఈ మెస్సేజ్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

SBI నుంచి వస్తున్న ఈ మెసేజ్ జాగ్రత్త..

చాలా మంది హ్యాకర్లు, స్కామర్‌లు ఎస్‌బిఐ వినియోగదారులకు మెసేజ్‌లు ఒకరకమైన మెస్సేజ్‌ పంపుతున్నారు. దీనికి రెస్పాండ్‌ అవడం వల్ల యూజర్ల డేటా వారికి తెలుస్తుంది. దీంతో అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం కాజేస్తున్నారు. పిఐబి ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఇటీవల ఈ మెస్సేజ్‌ని గుర్తించింది. ఇందులో ఎస్బీఐ వినియోగదారులకు వారి SBI Yono ఖాతా డీయాక్టివేట్ చేయబడిందని దాని కోసం వినియోగదారు తన PAN కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

పాన్ కార్డ్ వివరాలను అడిగే ఈ మెసేజ్ ఒక లింక్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ లింక్‌పై క్లిక్ చేసి వివరాలను అందించడం ద్వారా ముఖ్యమైన, ప్రైవేట్ సమాచారం హ్యాకర్లకు వెళుతుంది. ఇది నిజమని నమ్మడానికి హ్యాకర్లు కస్టమర్‌ పేరుని కూడా జోడిస్తారు. ఇలాంటి మెస్సేజ్‌కి అస్సలు రెస్పాండ్‌ కావొద్దని ఎస్బీఐ సూచిస్తోంది. మీకు ఈ సందేశం వస్తే వెంటనే బ్యాంకు అధికారులకి రిపోర్ట్ చేయండి. అవసరమైతే [email protected] కి ఇమెయిల్ చేయవచ్చు. లేదా ఎస్బీఐ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కూడా కాల్ చేయవచ్చు. గుర్తుంచుకోండి ఎస్బీఐ తన కస్టమర్ల వ్యక్తిగత వివరాలను SMS ద్వారా ఎప్పుడు అడగదు.

Show Full Article
Print Article
Next Story
More Stories