Smartphones: స్మార్ట్ ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఐఫోన్14, పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్..!

Best Smartphone Deals Flipkart Big Saving Days and Amazon Summer Sale 2023
x

Smartphones: స్మార్ట్ ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఐఫోన్14, పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్..!

Highlights

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది.

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో పలు స్మార్ట్ ఫోన్ల ధరలు దిగివచ్చాయి. గూగుల్ తన పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో ధరల్ని తగ్గించింది. గూగుల్ పిక్సెల్ ధర రూ.59,999 ఉంటే పిక్సెల్ 7 ప్రో ధర రూ.84,999గా ఉంది. తాజాగా ధరలు తగ్గడంతో పిక్సెల్ 7 రూ.49,999 కే లభ్యం అవుతోంది. అంటే రూ.10వేల వరకు ధర తగ్గింది, పిక్సెల్ 7 ప్రో ధర రూ.15వేలు తగ్గి రూ.69,999 కే లభిస్తోంది. ఇక ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ ఇచ్చే ఆఫర్లతో మరో రూ.5వేలు వరకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక యాపిల్ సైతం తన ఐఫోన్ 14 ధరలను తగ్గించింది. యాపిల్ మరికొన్ని రోజుల్లో ఐఫోన్ 15ను ఇంట్రడ్యూస్ చేయనుంది. దీంతో ఐఫోన్ 14 ధరను తగ్గించింది. యాపిల్ అధికారిక వెబ్ సైట్ లో ఐఫోన్ 14 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,900 గా ఉంది. అయితే తాజా తగ్గింపుతో రూ.66 వేలకే లభ్యం కానుంది. ఈకామర్స్ సంస్థల ఆఫర్లతో స్మార్ట్ ఫోన్ల ధరలు మరింత తగ్గాయి.

ఐఫోన్ 14పై ఫ్లిప్ కార్ట్ 12 శాతం తగ్గింపును అందిస్తోంది. ఎక్సేంజ్ ఆఫర్, బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.40,749 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14ని సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఆఫర్ల విషయానికొస్తే 10 శాతం తగ్గింపుతో రూ.71,999కే విక్రయిస్తుంది. అయితే క్రెడిట్, డెబిట్ కార్డ్ ఆఫర్లు, ట్రేడ్ ఇన్ ఆఫర్లు కలుపుకుంటే రూ.52,299 కంటే తక్కువకే ఐఫోన్ 14ను కొనుక్కోవచ్చు. అలాగే విజయ్ సేల్స్ లో కూడా ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఉంది. యాపిల్ డేస్ లో భాగంగా కేవలం రూ.70,999లకే ఐఫోన్14 కొనుగోలు చేయొచ్చు. 11 శాతం తగ్గింపుతో పాటు వివిధ ఆఫర్లను కలుపుకుంటే మరింత తగ్గుతోంది.

మరోవైపు గూగుల్ తమ కొత్త పిక్సెల్ 7ఏ ఫోన్ ను భారత్ మార్కెట్ లో విడుదల చేయనుంది. మే 11న దేశీయ మార్కెట్ లో ప్రవేశపెట్టనుంది. ఫ్లిప్ కార్ట్ లో మే 11 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories