Post Office: మీ డబ్బుకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్‌.. పోస్టాఫీస్‌లో బెస్ట్ స్కీమ్‌.. !

Best Saving Scheme in Post Office Time Deposit Scheme Details
x

Post Office: మీ డబ్బుకు భద్రతతో పాటు మంచి రిటర్న్స్‌.. పోస్టాఫీస్‌లో బెస్ట్ స్కీమ్‌.. !

Highlights

Post Office: ప్రస్తుతం ఆర్థిక అవసరాలు మారుతున్నాయి. పెరుగుతోన్న ఖర్చుల నేపథ్యంలో డబ్బు పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

Post Office: ప్రస్తుతం ఆర్థిక అవసరాలు మారుతున్నాయి. పెరుగుతోన్న ఖర్చుల నేపథ్యంలో డబ్బు పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఎలాంటి రిస్క్‌ లేకుండా పెట్టుబడిపై మంచి రిటర్న్స్‌ వచ్చే మార్గాలు ఎన్నో ఉంటాయి. వీటిలో ఎక్కువగా బ్యాంకుల వైపే మొగ్గు చూపుతారు. బ్యాంకుల్లో ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.

అయితే కేవలం బ్యాంకుల్లో మాత్రమే కాకుండా పోస్టాఫీస్‌లో కూడా ఇలాంటి పథకమే ఒకటి అందుబాటులో ఉంది. అదే టైమ్‌ డిపాజిట్‌ స్కీమ్‌. పోస్టాఫీస్‌ అందిస్తున్న ఈ టైమ్ డిపాజిట్‌ స్కీమ్‌లో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు ఇలా 4 కాల వ్యవధులు ఉంటాయి. వీటిల్లో వరుసగా వడ్డీ రేట్లు 6.9 శాతం, 7 శాతం, 7.10 శాతం, 7.50 శాతం చొప్పున వడ్డీ పొందొచ్చు. పోస్టాఫీస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో మీ పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే ప్రతీ 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సవరిస్తుంటారు.

ఇక జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ ఈ పథకం కింద వడ్డీ రేటును 7.50 శాతంగా నిర్ణయించారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌కు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు పెట్టుబడులపై మాత్రమే డిపాజిట్ ఇన్సూరెన్స్‌ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద గ్యారంటీ ఉంటుంది. అదే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో ఐదేళ్ల వ్యవధికి చూస్తే 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన మీరు ఐదేళ్ల డిపాజిట్‌పై రూ. లక్ష డిపాజిట్ చేసినట్లయితే 7.50 శాతం వడ్డీ రేటు ప్రకారం.. వడ్డీ రూ. 44,995 వస్తుంది. మొత్తం చేతికి ఐదేళ్ల తర్వాత రూ. 1,44,995 వస్తుంది. ఇదే విధంగా రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే రూ. 2,89,990 వస్తుంది. ఇక్కడ వడ్డీనే రూ. 89,990 గా ఉంది. ఇక ఐదేళ్ల వ్యవధికి రూ. 5 లక్షలు డిపాజిట్ చేసిన వారికి చేతికి రూ. 7,24,974 అందుతుంది.

ఈ పథకంలో కనీసం రూ. 1000 నుంచి డిపాజిట్‌ చేయొచ్చు, గరిష్ట పరిమితి అంటూ ఏంలేదు. ఈ పథకంలో సింగిల్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయొచ్చు. లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్‌ ఓపెన్‌ చేయొచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories