Saving Schemes: రిటైర్‌ అయ్యాక బిందాస్‌ ఉండాలనుకుంటున్నారా.? ఇవే బెస్ట్ ఆప్షన్స్‌

Best saving scheme for senior citizens for regular income
x

Saving Schemes: రిటైర్‌ అయ్యాక బిందాస్‌ ఉండాలనుకుంటున్నారా.? ఇవే బెస్ట్ ఆప్షన్స్‌ 

Highlights

Saving Schemes: ఇప్పటి నుంచే పెట్టుబడి పెడుతూ వెళ్తే వృద్ధాప్యంలో మంచి ఆదాయం పొందొచ్చు.

Saving Schemes: ఉద్యోగ విరమణ పొందిన తర్వాత బిందాస్‌గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణ పొందిన వారు అయితే ఎలాగో పెన్షన్‌ వస్తుంది కాబట్టి పర్లేదు. మరి ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారు, వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితి ఏంటి.? ఇలాంటి వారు వృద్ధాప్యంలో బిందాస్‌గా ఉండాలంటే ఏం చేయాలి.?

ఇలాంటి వారి కోసమే కొన్ని బెస్ట్‌ సేవింగ్‌ స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి నుంచే పెట్టుబడి పెడుతూ వెళ్తే వృద్ధాప్యంలో మంచి ఆదాయం పొందొచ్చు. ఎవరీపై ఆధారపడకుండా రిటర్న్స్‌ పొందొచ్చు. ఇలా క్రమంతప్పకుండా ఆదాయం కోరుకునే వారి కోసం ప్రస్తుతం మార్కెట్లో పలు పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్‌ స్కీమ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* పోస్టాఫీస్‌ అందిస్తోన్న సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ స్కీమ్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో ప్ర‌తి 3 నెల‌ల‌కోసారి వ‌డ్డీ పొందొచ్చు. ప్ర‌స్తుతం దీంట్లో వార్షిక వ‌డ్డీ రేటు 8.2%గా ఉంది. మూడు నెలలకు ఒకసారి ఆదాయం కోసం చూస్తున్న వారికి ఈ పథకం బాగుటుంది. 60 ఏళ్లు పైబ‌డిన ఎవ‌రైనా పోస్టాఫీసు లేదా బ్యాంకు ద్వారా దీనిలో చేర‌వచ్చు. ఎస్​సీఎస్ఎస్​(సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్) కాల వ్య‌వ‌ధి 5 ఏళ్లు. అయితే, ఈ స్కీమ్ మెచ్యూరిటీ పూర్తయిన అయిన త‌ర్వాత దీనిని 3 ఏళ్ల పాటు పొడిగించ‌వ‌చ్చు. ఇందులో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. 1961 ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సి కింద సంవ‌త్స‌రానికి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

* సీనియర్స్‌ సిటిజన్స్‌కు అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ స్కీమ్‌లో ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న ఒకటి. ఇందులో 60 సంవ‌త్స‌రాలు దాటిన‌వారు ఒకేసారి గ‌రిష్ఠంగా 15 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. అదేవిధంగా భార్యాభ‌ర్త‌లు ఈ స్కీమ్​లో చేరితే గ‌రిష్ఠంగా రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఇందులో వడ్డీని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పొందొచ్చు. దీనిపెట్టుబడి కాలం 10 ఏళ్లు. ఆ తర్వాతే వడ్డీ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 7.40 శాతం వడ్డీ అందిస్తున్నారు. నెలకు రూ. 9,250 పెన్షన్‌ రావాలంటే ఒకేసారి రూ. 15 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

* ప్రతీ నెల ఆదాయం పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో క‌నీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ. 4.50 ల‌క్ష‌ల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఉమ్మడి అకౌంట్‌లో అయితే.. రూ.9 ల‌క్ష‌లు గ‌రిష్ఠంగా పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఇందులో సంవ‌త్స‌రానికి ల‌భించే వ‌డ్డీ రేటు 6.60%. ఈ స్కీమ్​లో ప్ర‌తి నెలా వ‌డ్డీ వ‌స్తుంది. ఇది 5 ఏళ్ల లాక్‌ ఇన్‌ వ్యవధితో వస్తుంది. మెచ్యూర్‌ అయిన తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా మళ్లీ తిరిగి పెట్టుబడి పెట్టొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories