Business Idea: రూపాయి పెట్టుబడి లేకుండా లక్షల్లో ఆదాయం.. ఏం చేయాల్సి పని కూడా లేదు

Best business idea without spending any money, Mobile tower installation
x

Business Idea: రూపాయి పెట్టుబడి లేకుండా లక్షల్లో ఆదాయం.. ఏం చేయాల్సి పని కూడా లేదు 

Highlights

ఖాళీగా ఉండే టెర్రస్‌ను మీ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు.

ప్రస్తుతం ఆర్థిక అవసరాలు మారుతున్నాయి. రోజురోజుకీ పెరుగుతోన్న ఖర్చుల కారణంగా ఎంత సంపాదించిన సరిపోని పరిస్థితి. అందుకే చాలా మంది రెండు చేతులా సంపాదించాలని ఆశపడుతున్నారు. సెకండ్ ఇన్‌కమ్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూనే మరో ఆదాయ వనరు కోసం మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోతుండొచ్చు.

దీనికి కారణం పెట్టుబడి పెట్టాల్సి ఉండడం ఒకటైతే.. మరొకటి పనిచేయడం. మరి అలాంటిదేం లేకుండా బిందాస్‌గా నెలకు ఆదాయం వచ్చే మార్గాలు కూడా ఉన్నాయి. ఇలాంటి బెస్ట్ ఆప్షన్‌లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి పెట్టుబడి లేకుండా, చివరికీ ఏ పని చేయకుండా కూడా డబ్బులు సంపాదించే మార్గాల్లో మొబైల్ టవర్‌ ఇన్‌స్టాలేషన్‌ ఒకటి. ఇందుకోసం మీ ఇంటి పైకప్పు ఖాళీగా ఉంటే చాలు.

ఖాళీగా ఉండే టెర్రస్‌ను మీ ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొబైల్ టవర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఊరు చివర పెద్ద టవర్లు ఉండేవి. కానీ ఇప్పుడు బిల్డింగ్స్‌పై చిన్న చిన్న టవర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఖాళీగా ఉన్న టెర్రస్‌ను అద్దెకు ఇచ్చుకొని మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఇందుకోసం మీ ఇంటిపై ఖాళీ స్థలం ఉంటే చాలు. మొబైల్ కంపెనీలను సంప్రదించి టవర్స్‌ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

ఇందుకోసం కనీసం 500 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉండాలి. అలాగే బిల్డింగ్ కనస్ట్రక్షన్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. ఇక మీ ఇంటికి 100 మీటర్ల దూరంలో ఎలాంటి ఆసుపత్రులు, పాఠశాలలు లేదా విద్యాసంస్థలు ఉండకూడదు. ఇక అద్దె విషయానికొస్తే మొబైల్ కంపెనీల ఆధారంగా నెలకు రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు కూడా అద్దె పొందొచ్చు. ఎమ్‌టీఎన్‌, టాటా కమ్యూనికేషన్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇండుస్‌ టవర్స్‌, అమెరికన్‌ టవర్‌ కంపెనీ ఇండియా లిమిటెడ్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ కనెక్ట్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ వంటి కంపెనీలు ఈ సేవలను అందిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories