మీ దగ్గర రూ. 5వేలు ఉంటే చాలు.. ఢోకా లేని బిజినెస్‌ చేయొచ్చు..!

Best Business Idea With Low Investment Post Office Franchise Scheme Details
x

మీ దగ్గర రూ. 5వేలు ఉంటే చాలు.. ఢోకా లేని బిజినెస్‌ చేయొచ్చు..!

Highlights

Business Idea: సాధారణంగా వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని అంతా భావిస్తుంటారు. అంత పెట్టుబడి పెట్టి లాభాలు రాకుంటే ఎలా అనే ఆలోచనతో ఉంటాం.

Business Idea: సాధారణంగా వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని అంతా భావిస్తుంటారు. అంత పెట్టుబడి పెట్టి లాభాలు రాకుంటే ఎలా అనే ఆలోచనతో ఉంటాం. అయితే తక్కువ పెట్టుబడితో కూడా మంచి లాభాలు ఆర్జించే మార్గాలు ఉన్నాయి. అలాంటి ఓ మంచి బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశంలో పోస్టాఫీస్‌ లేని గ్రామం లేదని చెప్పడంలో సందేహం లేదు. దేశంలో సుమారు 1.55 లక్షల పోస్టాఫీస్‌లు ఉన్నాయి. పోస్టాఫీసుల మీద ఒత్తిడిని తగ్గించే నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీస్‌ ఫ్రాంచైజీలను తెరిచే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో మనీ ఆర్డర్ పంపడం, స్టాంపులు, స్టేషనరీ పంపడం, పోస్ట్ పంపడం, ఆర్డర్ చేయడం వంటి సేవలను అందిస్తుంటారు. ఈ బిజినెస్‌ ప్రారంభించేందుకు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు.

ఇండియా పోస్ట్‌ కొత్త పోస్టాఫీసులను తెరవడానికి ఫ్రాంచైజీ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో రెండు రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి. వీటిలో మొదటి ఫ్రాంచైజీ అవుట్‌లెట్, రెండవది పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీ. ఇది కాకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ పోస్టల్ స్టాంపులు, స్టేషనరీలను పంపిణీ చేసే ఏజెంట్లు ఉన్నారు. దీనిని పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీగా పిలుస్తుంటారు. ఫ్రాంచైజీని తీసుకునే వారి వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే కుటుంబ సభ్యులు ఎవరూ పోస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పచేస్తు ఉండకూడదు.

ఇక ఫ్రాంచైజీని తీసుకునే వ్యక్తి తప్పనిసరిగా 8వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. ఈ ఫ్రాంచైజ్‌ ఓపెన్‌ చేయడానికి 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ ప్రాంతం ఉండాలి. అలాగే ఫ్రాంచైజీని తెరవడానికి కనీసం సెక్యూరిటీ కోసం మొత్తం రూ. 5000 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక లాభాల విషయానికొస్తే.. స్పీడ్‌ పోస్ట్‌కు రూ.5, మనీ ఆర్డర్‌కు రూ. 3 నుంచి రూ. 5, పోస్టల్‌ స్టాంప్‌, స్టేషనరీపై 5 శాతం కమిషన్‌ లభిస్తుంది. పూర్తి వివరాల కోసం, దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf

Show Full Article
Print Article
Next Story
More Stories