Business Idea: ఇల్లు కదలకుండా వేలల్లో ఆదాయం.. మహిళలకు బెస్ట్ బిజినెస్ ఐడియా

Business Idea
x

Business Idea: ఇల్లు కదలకుండా వేలల్లో ఆదాయం.. మహిళలకు బెస్ట్ బిజినెస్ ఐడియా

Highlights

Business Idea: ఆర్థిక అవసరాలు మారుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో ఒక్క చేత్తో సంపాదన సరిపోవడం లేదు.

Business Idea: ఆర్థిక అవసరాలు మారుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో ఒక్క చేత్తో సంపాదన సరిపోవడం లేదు. అందుకే రకరకాల మార్గాల్లో ఆదాయం పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సైడ్ ఇన్ కమ్ కోసం చూస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గృహిణిలు కూడా ఇంట్లో ఉంటూనే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఇల్లు కదలకుండా డబ్బులు సంపాదించే ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇంట్లోనే ఉంటూ భారీగా ఆదాయం ఆర్జించే వ్యాపారాల్లో దూప్ కప్స్ తయారీ మంచి ఆలోచనల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భారీగా ఆదరణ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇళ్లతోపాటు వ్యాపార సమదాయాల్లో కూడా వీటి వినియోగం ఎక్కువ అవుతుంది. దీంతో ఈ వ్యాపారం మొదలుపెట్టిన వారికి భారీగా ఆదాయాలు వస్తున్నాయి. ఇంతకీ దూప్ కప్స్ తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఇందుకు ఎంత పెట్టుబడి కావాలి, లాభాలు ఎలా ఉంటాయన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

దూప్ కప్స్ తయారీకి ఒక చిన్న మిషన్ అవసరపడుతుంది, అలాగే ఇందుకు కావాల్సిన రా మెటీరియల్ కూడా ఉండాలి. మిషన్ విక్రయించే వారే ముడి సరుకును కూడా అందిస్తారు. పొడి రూపంలో ఉన్న ముడి సరుకును మిషన్ లో వేస్తే బయటకు కప్ వస్తుంది. అనంతరం ఈ కప్ లో దూప్ ను వేయాల్సి ఉంటుంది. ఈ దూప్ కూడా ప్రత్యేకంగా లభిస్తుంది.

ఇలా తయారు చేసుకున్న దూప్ కప్స్ ని ఆకర్షనీయమైన ప్యాకింగ్ చేసి విక్రయించుకోవాలి. మీ సొంత బ్రాండింగ్ పేరుతో ప్యాకింగ్ చేయించి, మార్కెటింగ్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో దూప్ కప్స్‌ ప్యాకెట్ రూ. 50గా ఉంది. సుమారు ఒక్కో దూప్ కప్ పై రూ. 20 నుంచి రూ. 25 లాభం లభిస్తుంది. మంచి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా తక్కువలో తక్కువ నెలకు రూ. 20 వేలకు పైగా సంపాదన ఆర్జించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories