Business Idea: ఇల్లు కదలకుండానే వేలల్లో సంపాదన.. బెస్ట్ బిజినెస్ ప్లాన్‌...?

Best business idea wiper manufacturing business details in telugu
x

Business Idea: ఇల్లు కదలకుండానే వేలల్లో సంపాదన.. బెస్ట్ బిజినెస్ ప్లాన్‌...?

Highlights

Business Idea: ఇల్లు కదలకుండానే వేలల్లో సంపాదన.. బెస్ట్ బిజినెస్ ప్లాన్‌...?

Business Idea: పెరుగతోన్న ఖర్చులు, మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలా మంది ప్రస్తుతం డబుల్‌ ఇన్‌కమ్‌ కోసం చూస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చిన్నగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. దీంతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. మార్కెట్లో ఇలాంటి వారి కోసం ఎన్నో మంచి బిజినెస్‌ ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నారా.? అయితే మీకోసం ఒక మంచి బిజినెస్ ఐడియాను తీసుకొస్తున్నాం. ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందొచ్చు, అది కూడా ఇల్లు కదలకుండానే.

ఇంతకీ ఆ బిజినెస్‌ ఏంటంటే.. వైపర్‌ మేకింగ్‌. ప్రస్తుతం వైపర్‌ల వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే వీటిని ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైపర్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో వైపర్‌ల అమ్మకాలు పెరిగాయి. అలాంటి ఈ వైపర్‌ తయారీని ప్రారంభిస్తే నష్టాలు లేకుండా భారీగా డబ్బులు ఆర్జించవచ్చు. ఇంతకీ వైపర్‌ తయారీని ఎలా ప్రారంభించాలి.? ఇందుకు ఎంత పెట్టుబడి అవసరపడుతుంది.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వైపర్‌ తయారీ కోసం రెండు రకాల మిషన్స్‌ అవసరపడతాయి. వీటిలో ఒకటి కటింగ్ మిషన్‌ కాగా, మరొకటి బటన్‌ ప్రెస్సింగ్ మిషన్‌. ఈ రెండు మిషన్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. అలాగే వైపర్‌ తయారీకి అవసరమయ్యే ముడి సరుకు కూడా ఈ మిషన్స్ అమ్మే వారే అందిస్తున్నారు. వైపర్‌ తయారీకి షీట్స్‌ కావాల్సి ఉంటుంది. వీటి ధర రూ. 200 నుంచి ప్రారంభమవుతాయి. ఒక్క షీట్‌తో సుమారు 10 వరకు వైపర్‌లను తయారు చేయొచ్చు. దీంతో పాటు షీట్స్‌ను హోల్డ్‌ చేసే క్యాప్‌, బటన్స్‌ అవసరపడతాయి.

వీటితో పాటు వైపర్‌కు ఉపయోగించే స్టిక్స్‌, ప్యాకింగ్ కవర్స్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక వైపర్‌ తయారీ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా షీట్స్‌ను తీసుకొని కటింగ్ మిషన్‌ ద్వారా కట్‌ చేయాలి. అనంతరం వాటిని షీట్స్‌ను హోల్డ్‌ చేసే క్యాప్‌లో ఇన్‌సెర్ట్ చేయాలి. ఆ తర్వాత ఫీట్‌ క్యాప్‌లో ఆగడానికి బటన్స్ ప్రెస్సింగ్ మిషన్స్‌ ద్వారా ఇన్‌సెర్ట్‌ చేయాలి. చివరికి క్యాప్‌కు కర్రను సెట్‌ చేస్తే సరిపోతుంది. ఈ బిజినెస్‌ను కేవలం రూ. 15 వేల ప్రారంభపెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఇక తయారు చేసిన వైపర్స్‌ను మీరే నేరుగా మీకు దగ్గర్లోని దుకాణాల్లో విక్రయించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories