Best Business Ideas: బిజినెస్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారా.? ఇంట్లో నుండే భారీ ఆదాయం వచ్చే బిజినెస్ ఐడియా

Best Business Ideas: బిజినెస్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారా.? ఇంట్లో నుండే భారీ ఆదాయం వచ్చే బిజినెస్ ఐడియా
x
Highlights

Best Business Ideas: ప్రస్తుతం వ్యాపారం చేయాలని ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం ప్రారంభించాలని...

Best Business Ideas: ప్రస్తుతం వ్యాపారం చేయాలని ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లోనే ఉండి వ్యాపారం చేయాలనుకుంటున్న మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి వారికి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ప్లాన్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం..

ప్రస్తుతం పికిల్స్‌ బిజినెస్‌కు ఆదరణ భారీగా పెరుగుతోంది. సంప్రదాయ ఆవకాయ పికిల్స్‌ మాత్రమే కాకుండా రకరకాల కూరగాయలతో పాటు నాన్‌-వెజ్‌ పికిల్స్‌ వరకు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆన్‌లైన్‌లో కూడా పికిల్స్‌ విక్రయాలు జరుపుతున్నారు. ఈ బిజినెస్‌ను ప్రారంభించుకుంటే మంచి ఆదాయాలు పొందొచ్చు. అలాగే ఇల్లు కదలకుండానే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఇందుకోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. ముందుగా ఏ రకమైన పికిల్స్‌ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ముడి సరుకులను కొనుగోలు చేయాలి. అనంతరం ఇంట్లోనే ఉండి పచ్చళ్లను తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పికిల్స్‌ను పార్శిల్‌ చేసుకొని మీకు నచ్చిన బ్రాండ్‌తో విక్రయించుకోవచ్చు. ఇలాంటి వ్యాపారాలకు మౌత్ టాక్‌తోనే పబ్లిసిటీ వస్తుంది.

ఇక మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలనుకుంటే.. ప్రత్యేకంగా పికిల్స్‌ షాప్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మున్సిపాలిటీ రేంజ్‌ పట్టణాల్లో కూడా ఇటీవల ఈ పికిల్స్‌ బిజినెస్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఒక షటర్‌ రెంట్ తీసుకొని దుకాణం ఏర్పాటు చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఈ పికిల్స్‌ వ్యాపారంతో లక్షల్లో ఆర్జిస్తున్న వారు కూడా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories