Bank Holidays: జనవరిలో 16 రోజులు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా పరిశీలించండి..

Banks Closed for 16 Days in January Check the Holiday List
x

Bank Holidays: జనవరిలో 16 రోజులు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా పరిశీలించండి..

Highlights

Bank Holidays: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది మొదటి నెల అంటే జనవరిలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది.

Bank Holidays: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది మొదటి నెల అంటే జనవరిలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో (జనవరి 2022) బ్యాంకులకు సంబంధించి ఏదైనా పని పూర్తి చేయాలంటే వెంటనే చేయండి. లేదంటే తర్వాత కష్టతరం అవుతుంది. కారణం ఏంటంటే జనవరిలో బ్యాంకులకు 16 రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే ఇది ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది. ఒక్కసారి సెలవుల జాబితా గురించి తెలుసుకుందాం.

జనవరి 1, 2022 – నూతన సంవత్సర పండుగ సందర్భంగా ఐజ్వాల్, షిల్లాంగ్, చెన్నై, గ్యాంగ్‌టక్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.

జనవరి 3, 2022 – న్యూ ఇయర్ సెలబ్రేషన్ / లాసంగ్ సందర్భంగా, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్ బ్యాంకులు మూసివేస్తారు.

4 జనవరి 2022 – లాసంగ్ పండుగ సందర్భంగా గ్యాంగ్‌టక్ బ్యాంకులు మూసివేస్తారు.

జనవరి 11, 2022 – మిషనరీ డే సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు మూసివేస్తారు.

జనవరి 12, 2022 – స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకులు మూసివేస్తారు.

జనవరి 14, 2022 - మకర సంక్రాంతి, పొంగల్ సందర్భంగా, అహ్మదాబాద్, చెన్నైలోని బ్యాంకులు మూసివేస్తారు.

15 జనవరి 2022 – ఉత్తరాయణ పుణ్యకాల మకర సంక్రాంతి పండుగ/పొంగల్ సందర్భంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గ్యాంగ్‌టక్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.

జనవరి 18, 2022 - తైపూసం పండుగ కారణంగా చెన్నైలో బ్యాంకులు మూసివేస్తారు.

26 జనవరి 2022 – గణతంత్ర దినోత్సవం సందర్భంగా, దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పూర్తిగా మూసివేస్తారు.

వచ్చే నెల 5 ఆదివారం సెలవులు

తదుపరి నెలలో (జనవరి 2022), 5 ఆదివారాలు వస్తాయి. ఇందులో జనవరి 2, జనవరి 9, జనవరి 16, జనవరి 23, జనవరి 30 ఉన్నాయి. ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తారు. జనవరి 8న రెండో శనివారం జనవరి 22. నాలుగో శనివారం వస్తుంది. దీని కారణంగా బ్యాంకులు మూసివేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories