FD Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన ఆ బ్యాంక్‌.. సీనియర్‌ సిటిజన్లకు పండగే..!

Bank of Baroda Increase Interest Rates on Fixed Deposits
x

FD Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన ఆ బ్యాంక్‌.. సీనియర్‌ సిటిజన్లకు పండగే..!

Highlights

FD Interest Rates: సుస్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు పలు రకాల పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. వీటిలో ప్రధానమైన వాటిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ ఒకటి.

FD Interest Rates: సుస్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు పలు రకాల పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. వీటిలో ప్రధానమైన వాటిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ ఒకటి. ముఖ్యంగా ఉద్యోగ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం, భద్రత కోరుకునే వారు ఎఫ్‌డీల్లోనే పెట్టుబడులు పెడుతున్నారు. ఇక బ్యాంకింగ్ రంగంలో పెరిగిన పోటీ నేపథ్యంలో ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి బ్యాంకులు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తాజాగా వడ్డీ రేట్లను సవరించింది.

రూ. 3 కోట్ల కంటే తక్కువ ఎన్ఆర్ఓ డిపాజిట్లతో సహా దేశీయ టర్మ్ డిపాజిట్లకు కొత్త రేట్లు వర్తిస్తాయని బ్యాంకు ప్రకటించింది. రకరకాల కాల వ్యవధులపై విభిన్నమైన వడ్డీ రేట్లను బ్యాంక్‌ అందించనున్నట్లు ప్రకటించింది. కాలం పెరిగే కొద్దీ వడ్డీ రేటును పెంచుతూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. మూడు సంవత్సరాల వరకు డిపాజిట్ చేస్తే అదనంగా 0.50 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సవరించిన వడ్డీ రేట్ల ఆధారంగా.. 7 రోజుల నుంచి 14 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 4.75 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే.. 15 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం వడ్డీ అందించనున్నారు. ఇక 46 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.50 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం వడ్డీ లభిస్తుంది. 91 రోజుల నుంచి 180 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.60 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 6.10 శాతం వడ్డీ లభిస్తుంది.

అదే విధంగా 181 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ అందించనున్నారు. ఇక 211 రోజుల నుంచి 270 రోజుల వరకు సాధారణ ప్రజలకు 6.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ అందిస్తారు. 271 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధికి సాధారణ ప్రజలకు 6.50 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ లభించనుంది. ఇక ఏడాది ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్ కింద సాధారణ ప్రజలకు 7.1 శాతం వడ్డీ ఇస్తుంటే సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories