Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్.. ఆగస్టులో 14 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Bank Holidays in August 2023 Banks Remain Closed 14 Days August 2023 Check full Details
x

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్.. ఆగస్టులో 14 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!

Highlights

Bank Holidays in August 2023: బ్యాంకులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు అనేక సూచనలు జారీ చేస్తుంది.

Bank Holidays in August 2023: బ్యాంకులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు అనేక సూచనలు జారీ చేస్తుంది. ఆగస్టు నెలలో 14 రోజుల పాటు బ్యాంకులు తెరవరని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకులకు వెళ్లాల్సిన వారంతా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్‌బీఐ సూచించింది. ఆగస్టు నెలలో స్వాతంత్ర్య దినోత్సవం, రక్షాబంధన్, ఓనంతో సహా అనేక పండుగలు ఉన్నాయి. వాటి కారణంగా బ్యాంకులు మూసివేస్తుంటారు.

లాంగ్ వీకెండ్స్ ..

ఆగస్టు నెలలో రాష్ట్రాల సెలవులతో సహా 14 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. దీనితో పాటు చాలా లాంగ్ వీకెండ్‌లు కూడా వస్తున్నాయి. దీంతో వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ఆర్‌బీఐ నుంచి అందిన సమాచారం ప్రకారం రెండో, నాలుగో శనివారాల్లో కూడా బ్యాంకులు పని చేయవు.

ఆగస్ట్ నెలలో (ఆగస్టులో బ్యాంక్ సెలవులు) బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

>> ఆదివారం కారణంగా ఆగస్టు 6న బ్యాంకులకు సెలవు.

>> ఆగస్టు 8న గాంగ్‌టక్‌లో టెండాంగ్ ల్హో రమ్ కారణంగా బ్యాంకులకు సెలవు.

>> ఆగస్టు 12వ తేదీ రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.

>> ఆదివారం కారణంగా ఆగస్టు 13న వారాంతపు సెలవు ఉంటుంది.

>> స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా ఆగస్టు 15న బ్యాంకులు మూతపడతాయి.

>> పార్సీ నూతన సంవత్సరం కారణంగా ఆగస్టు 16న ముంబై, నాగ్‌పూర్, బేలాపూర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.

>> శ్రీమంత్ శంకర్‌దేవ్ తిథి కారణంగా ఆగస్టు 18న గౌహతిలో బ్యాంకులు మూసివేయబడతాయి.

>> ఆగస్టు 20 ఆదివారం కారణంగా, దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.

>> నాల్గవ శనివారం కారణంగా ఆగస్టు 26న బ్యాంకులకు సెలవు.

>> ఓనం కారణంగా ఆగస్టు 28న కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు.

>> తిరుఓణం కారణంగా ఆగస్టు 29న కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేస్తారు.

>> రక్షా బంధన్ కారణంగా ఆగస్టు 30న జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు.

>> రక్షా బంధన్ / శ్రీ నారాయణ గురు జయంతి / పాంగ్-లాబ్సోల్ కారణంగా ఆగస్టు 31న డెహ్రాడూన్, గాంగ్టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలోని బ్యాంకులు పనిచేయవు.

అధికారిక లింక్‌ మీకోసం..

బ్యాంక్ సెలవుల గురించి మరింత సమాచారం కోసం, మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక లింక్‌ను కూడా సందర్శించవచ్చు. https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx . ఇక్కడ మీరు ప్రతి నెలా ప్రతి రాష్ట్రం బ్యాంకు సెలవుల గురించి సమాచారాన్ని పొందవచ్చు.

ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ సదుపాయం..

ఆగస్టు నెలలో సెలవుల కారణంగా బ్యాంకులు మూసివేస్తారు. మొబైల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రజలు ఇంట్లో కూర్చొని తమ పనిని చేసుకోవచ్చని బ్యాంక్ ఈ సదుపాయాన్ని కల్పించింది. ATM నుంచి నగదు విత్‌డ్రా చేసేటప్పుడు సమస్యలు అందుకే సెలవులకు ముందు నగదును ఏర్పాటు చేసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories