Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకి 10 రోజులు సెలవులు.. డేట్స్‌ ఏంటంటే..?

Bank Holiday List November 2022 Ten Days Holidays for Banks in November Dates are Like This
x

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకి 10 రోజులు సెలవులు.. డేట్స్‌ ఏంటంటే..?

Highlights

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకి 10 రోజులు సెలవులు.. డేట్స్‌ ఏంటంటే..?

Bank Holidays in November 2022: సంవత్సరంలో 10వ నెల (అక్టోబర్) ముగియనుంది. అలాగే నవంబర్ నెల ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు నవంబర్ నెలలో ఏదైనా బ్యాంక్ పనిని చేయాలనుకుంటున్నట్లయితే బ్యాంక్ సెలవుదినాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం నవంబర్‌లో మొత్తం 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవుల జాబితాను మూడు వర్గాలుగా విభజించింది. ఇందులో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్‌లు అకౌంట్లను క్లోజ్ చేయడం వంటివి ఉంటాయి. జాతీయ సెలవులతో పాటు, కొన్ని రాష్ట్ర-నిర్దిష్ట సెలవులు కూడా ఉంటాయి. వీటిలో అన్ని ఆదివారాలు అలాగే నెలలోని రెండో, నాల్గవ శనివారాలు కూడా ఉంటాయి. నవంబర్ నెలలో మొత్తం 10 రోజులు బ్యాంకులు క్లోజ్‌ అవుతున్నాయి.

1 నవంబర్ 2022 – కన్నడ రాజ్యోత్సవ/కుట్ – బెంగళూరు, ఇంఫాల్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.

6 నవంబర్ 2022 - ఆదివారం (వారపు సెలవు)

నవంబర్ 8, 2022 – గురునానక్ జయంతి/కార్తీక పూర్ణిమ/రహస్ పూర్ణిమ/వంగల ఫెస్టివల్ ఈ సందర్భంగా బ్యాంకులు అగర్తల, బెంగుళూరు, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, కొచ్చి, పనాజీ, పాట్నా, షిల్లాంగ్, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేస్తారు.

11 నవంబర్ 2022 - కనకదాస జయంతి/ వాంగ్లా పండుగ - బెంగళూరు, షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.

12 నవంబర్ 2022 - శనివారం (నెలలో 2వ శనివారం)

13 నవంబర్ 2022 - ఆదివారం (వారం సెలవు)

20 నవంబర్ 2022 - ఆదివారం (వారపు సెలవు)

23 నవంబర్ 2022 - సెంగ్ కుత్సానేం- షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేస్తారు.

26 నవంబర్ 2022 - శనివారం (నెలలో నాల్గవ శనివారం)

27 నవంబర్ 2022 - ఆదివారం (వారపు సెలవు)

Show Full Article
Print Article
Next Story
More Stories