Bajaj Housing Finance IPO:నేటి నుంచి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీవో ప్రారంభం..మినిమం ఎన్ని షేర్లు కొనాలి..ఎంత ఇన్వెస్ట్ చేయాలి

Bajaj Housing Finance Limited IPO Commencement Minimum How Many Shares Should Be Purchased From Today
x

Bajaj Housing Finance IPO:నేటి నుంచి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీవో ప్రారంభం..మినిమం ఎన్ని షేర్లు కొనాలి..ఎంత ఇన్వెస్ట్ చేయాలి

Highlights

Bajaj Housing Finance IPO Subscription Status: ఈ మధ్యకాలంలో ఐపీఓ ద్వారా ఇన్వెస్టర్లు చక్కటి లాభాలను పొందుతున్నారు. గత నెలలో లిస్టింగ్ వద్ద కొన్ని సందర్భాల్లో 100% లాభాలు కూడా అందుకున్న ఐపివోలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్ గా పిలవబడే ఐపిఓల పైన ప్రతి ఒక్కరు కన్నేసి ఉంచారు.

Bajaj Housing Finance IPO Subscription Status: ఈ మధ్యకాలంలో ఐపీఓ ద్వారా ఇన్వెస్టర్లు చక్కటి లాభాలను పొందుతున్నారు. గత నెలలో లిస్టింగ్ వద్ద కొన్ని సందర్భాల్లో 100% లాభాలు కూడా అందుకున్న ఐపివోలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ప్రైమరీ మార్కెట్ గా పిలవబడే ఐపిఓల పైన ప్రతి ఒక్కరు కన్నేసి ఉంచారు. మీరు కూడా ఐపిఓ మార్కెట్ లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటే. ఈ వారం ఏకంగా 13 ఐపివోలు ప్రారంభం కానున్నాయి. అందులో ముఖ్యంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (Bajaj Housing Finance Limited) ఐపిఓ ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ వారం ఐపీఓల గురించి తెలుసుకుందాం.

ఈ వారం 13 కంపెనీలు పెట్టుబడి కోసం తెరుచుకోనున్నాయి. వీటిలో నాలుగు IPOలు ప్రధాన బోర్డు నుండి, 9 IPOలు SME బోర్డ్ నుండి లిస్టింగ్ కానున్నాయి. వచ్చే వారం ఐపీఓలు జారీ చేసే కంపెనీలు దీని ద్వారా రూ.8644 కోట్లు సమీకరించనున్నాయి. దీంతో పాటు 8 ఐపీఓల లిస్టింగ్ కూడా వచ్చే వారం జరగనుంది.

సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 13 వరకు మొత్తం 13 ఐపీఓలు ప్రైమరీ మార్కెట్లో తమ బిడ్స్ ఓపెన్ చేయనున్నాయి. ఇటీవల అనేక IPOలు ఇన్వెస్టర్లకు లిస్టింగ్‌పై బంపర్ రాబడిని ఇచ్చాయి. దీంతో IPOలలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య బాగా పెరిగింది. కానీ అన్ని IPOలు లిస్టింగ్ సమయంలో మంచి రాబడిని ఇవ్వవు. ఒక్కో సారి పెట్టుబడిదారులు నష్టపోయే అవకాశం ఉంది.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్:

ఈ IPO ఇష్యూ పరిమాణం రూ.6560 కోట్లు.కంపెనీ రూ.3560 కోట్ల విలువైన 50.86 తాజా షేర్లను రూ.3000 కోట్ల విలువైన OFS కింద 42.86 షేర్లను జారీ చేస్తుంది.IPO సోమవారం, సెప్టెంబర్ 9, 2024 నుంచి తెరుచుకుంది. సెప్టెంబర్ 11న ముగుస్తుంది. ఈ ఐపీవో ప్రైజ్ బ్యాండ్ ధర 66 నుండి 70 రూపాయల మధ్య ఉంటుంది.సెప్టెంబర్ 16న లిస్టింగ్ జరగనుంది.

IPOలో, రిటైల్ పెట్టుబడిదారులు ఒక లాట్ 214 షేర్లకు బిడ్లు వేయవచ్చు. గరిష్టంగా 13 లాట్‌లను సబ్‌స్క్రయిబ్ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, రిటైల్ ఇన్వెస్టర్లు కనిష్టంగా రూ.14,980 గరిష్టంగా రూ.1,94,740 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది నాన్-డిపాజిట్ టేకింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (HFC).ఈ సంస్థ 2008 సంవత్సరంలో స్థాపించారు. కంపెనీ 2015 నుండి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB)లో రిజిస్టర్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories