Canara Bank: కెనరా బ్యాంక్‌ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్‌.. ఇప్పుడు మరింత చెల్లించాల్సిందే..!

Bad News For Canara Bank Customers Now They Have To Pay More Interest On Loans
x

Canara Bank: కెనరా బ్యాంక్‌ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్‌.. ఇప్పుడు మరింత చెల్లించాల్సిందే..!

Highlights

Canara Bank: ఈ రోజుల్లో ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకోవడం సాధారణంగా మారింది.

Canara Bank: ఈ రోజుల్లో ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడానికి బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకోవడం సాధారణంగా మారింది. కష్ట సమయాల్లో బ్యాంకులు డబ్బులు అందించి ఆదుకుంటున్నాయి. కానీ ఇచ్చిన మొత్తంపై వడ్డీ వసూలు చేస్తాయి. అయితే రకరకాల బ్యాంకులు రకరకాల వడ్డీరేట్లను కలిగి ఉంటాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఖాతాదారులపై మరింత భారం పడుతోంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

లోన్‌

వాస్తవానికి కెనరా బ్యాంక్ రుణాలపై వడ్డీ రేటును పెంచింది. దీనివల్ల ఖాతాదారులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రజల జేబులపై తీవ్ర ప్రభావం పడుతోంది. కెనరా బ్యాంక్ వివిధ మెచ్యూరిటీ పీరియడ్‌ల బెంచ్‌మార్క్ లోన్ రేట్లను 0.05 శాతం పెంచింది. దీంతో బ్యాంకు రుణాలు ఖరీదైనవిగా మారాయి. వివిధ మెచ్యూరిటీ కాలాల కోసం నిధుల ఆధారిత రుణ రేటు (MCLR) మార్జినల్ కాస్ట్‌ను 0.05 శాతం పెంచినట్లు బ్యాంక్ తెలిపింది. నవంబర్ 12 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఒక సంవత్సరం MCLR 8.75 శాతం ఉంది. గతంలో ఈ రేటు 8.70 శాతంగా ఉండేది.

MCLR పెంపు

కెనరా బ్యాంక్ ఒక రోజు, ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలల MCLR ను 0.05 శాతం పెంచింది. పర్సనల్ లోన్, కార్ లోన్, బైక్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ మొదలైన లోన్లపై వడ్డీరేటు మరింత పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories