ATM Card: ఏటీఎం కార్డు ఉపయోగిస్తే ఉచితంగా 5 లక్షలు..!

ATM Card Insurance Check for All Details
x

ATM Card: ఏటీఎం కార్డు ఉపయోగిస్తే ఉచితంగా 5 లక్షలు..!

Highlights

ATM Card: ఏటీఎం కార్డు ఉపయోగిస్తే ఉచితంగా 5 లక్షలు..!

ATM Card: అవును ఇది నిజమే. ఏటీఎం కార్డ్‌ని ఉపయోగిస్తే బ్యాంకు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. కానీ దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. ఇది ఒక రకమైన బీమా. దీని కోసం కార్డుదారుని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు క్లెయిమ్ చేయకుంటే ఈ మొత్తాన్ని పొందలేరు. ఎందుకంటే దీని గురించి ఏ బ్యాంకు అధికారి తెలియజేయరు. అయితే 5 లక్షలకు క్లెయిమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ATM కార్డ్‌తో లభించే ఉచిత సేవల్లో ముఖ్యమైనది బీమా. ఖాతాదారునికి ATM కార్డును జారీ చేసిన వెంటనే ప్రమాద బీమా అమలవుతుంది. అయితే ఈ బీమాపై అవగాహన లేకపోవడంతో కొద్దిమంది మాత్రమే క్లెయిమ్ చేసుకోగలుగుతున్నారు. గ్రామాల్లో ఉండే ప్రజల సంగతి పక్కన పెడితే చాలా మంది విద్యావంతులకు కూడా ATM రూల్స్ తెలియవు. బ్యాంకు కూడా ఈ సమాచారాన్ని ఖాతాదారులకు తెలియజేయదు.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ప్రమాదానికి గురైన వ్యక్తి కనీసం 45 రోజుల క్రితం ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎం కార్డును ఉపయోగిస్తే బీమాకు అర్హులవుతారు. ATM ఇన్సూరెన్స్ అమౌంట్‌ అనేది ATM కార్డు రకంపై ఆధారపడి ఉంటుంది. వివిధ కేటగిరీల ప్రకారం బ్యాంకు కార్డుదారులకు బీమా అందిస్తుంది. ఇందులో క్లాసిక్, ప్లాటినం సాధారణమైనవి. సాధారణ మాస్టర్ కార్డ్‌పై 50,000 రూపాయలు, క్లాసిక్ ATM కార్డ్‌పై లక్ష రూపాయలు, వీసా కార్డ్‌పై 1.5 నుంచి 2 లక్షల రూపాయలు, ప్లాటినం కార్డ్‌పై 5 లక్షల రూపాయలు చెల్లిస్తారు.

ఏటీఎం కార్డు వినియోగదారులు ప్రమాదంలో మరణిస్తే 1 నుంచి 5 లక్షల రూపాయల వరకు బీమా లభిస్తుంది. మరోవైపు ఒక చేయి లేదా కాలు దెబ్బతిన్నట్లయితే రూ.50000 వరకు బీమా మొత్తం లభిస్తుంది. ఇందుకోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. కార్డుదారుని నామినీ బ్యాంకుకు దరఖాస్తును సమర్పించాలి. అవసరమైన పత్రాలని జత చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories