ATM Card: ఏటీఎం కార్డు బ్లాక్ అయితే టెన్షన్‌ వద్దు.. వెంటనే ఇలా అన్‌బ్లాక్ చేయండి..!

ATM Card Blocked by Mistake Unblock it Immediately Like This
x

ATM Card: ఏటీఎం కార్డు బ్లాక్ అయితే టెన్షన్‌ వద్దు.. వెంటనే ఇలా అన్‌బ్లాక్ చేయండి..!

Highlights

ATM Card: పొరపాటున ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిందా.. అయితే టెన్షన్ పడకండి.

ATM Card: పొరపాటున ఏటీఎం కార్డ్ బ్లాక్ అయిందా.. అయితే టెన్షన్ పడకండి. ఎందుకంటే దానిని సులభంగా అన్‌బ్లాక్ చేయవచ్చు. పొరపాటున తప్పు పిన్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా కొన్నిసార్లు ఏటీఎం కార్డ్ బ్లాక్ అవుతుంది. అలాగే ఏటీఎం కార్డ్‌ను పోగొట్టుకుంటే కొన్నిసార్లు బ్లాక్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఏటీఎంని అన్‌బ్లాక్ చేసినట్లయితే దానిని మళ్లీ ఉపయోగించవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

మీరు ఏటీఎం మెషిన్ నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు వరుసగా మూడు సార్లు తప్పు ఏటీఎం పిన్‌ నెంబర్‌ని ఎంటర్‌ చేస్తే ఏటీఎం కార్డ్ బ్లాక్ అవుతుంది. ఈ సందర్భంలో మీరు 24 గంటలు వేచి ఉండాలి. తర్వాత మీ ఏటీఎం కార్డు ఆటోమేటిక్‌గా అన్‌బ్లాక్ అవుతుంది. దీన్ని మునుపటిలా సులభంగా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు.

కొత్త ఏటీఎం కార్డ్

ఏటీఎం కార్డు నుంచి ఎవరైనా మోసపూరిత లావాదేవీ చేసినట్లు భావిస్తే వెంటనే దాన్ని బ్లాక్ చేయాలి. కొత్త ఏటీఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ మీకు 5 నుంచి 7 రోజుల్లో కొత్త ఏటీఎం కార్డును ఇస్తుంది. భద్రతా కారణాల వల్ల కొంత నిర్లక్ష్యం కారణంగా ఏటీఎం కార్డ్ బ్లాక్ అయితే సమీపంలోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం మీరు మీ ID రుజువును చూపించవలసి ఉంటుంది. తర్వాత బ్యాంక్ మీ దరఖాస్తును 48 గంటల నుంచి ఐదు రోజుల మధ్య ఫార్వార్డ్ చేస్తుంది.

గడువు ముగిసిన తర్వాత

మీరు ఏటీఎం కార్డును ఉపయోగిస్తుంటే కార్డు వ్యాలిడిటీ మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుందని గమనించాలి. తర్వాత స్వయంచాలకంగా గడువు ముగుస్తుంది. ఈ సందర్భంలో మీరు కొత్త ఏటీఎం పొందవలసి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత కొత్త ఏటీఎం కార్డు మీ చిరునామాకు పంపుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories