Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్‌ ఏ వయసులో తీసుకుంటే బెస్ట్‌.. ఎప్పుడైనా ఆలోచించారా..!

At What Age Is It Best To Take Health Insurance Know Complete Details
x

Health Insurance:హెల్త్‌ ఇన్సూరెన్‌ ఏ వయసులో తీసుకుంటే బెస్ట్‌.. ఎప్పుడైనా ఆలోచించారా..!

Highlights

Health Insurance: ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా మారాయి.

Health Insurance: ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా మారాయి. ఉద్యోగం చేసేవారైతే కచ్చితంగా తీసుకోవాలి. ఇక ఇందులో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయానికి వస్తే చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అనేది ఒక వ్యక్తి హెల్త్‌ ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోకుం డా కాపాడుతుంది. అయితే కొందరు ఇప్పుడు మేము యంగ్‌ గా ఉన్నాం కదా మాకెందుకు అను కుంటారు. కానీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ రోజు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఏ వయసులో తీసుకోవాలో తెలుసుకుందాం.

ఇన్సూరెన్స్‌ కంపెనీలు వసూలు చేసే ప్రీమియం మొత్తం పాలసీదారుడి ప్రస్తుత వయసుపై ఆధారపడి ఉంటుంది. పాలసీ తీసుకునేవారు యుక్త వయసులోనే పాలసీని ఎంచుకుంటే తక్కువ ప్రీమియంతోనే పొందొచ్చు. 25 ఏళ్ల యుక్త వయసుగల వ్యక్తి రూ.5 లక్షల విలువ గల ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే ప్రీమియం సుమారుగా రూ.5,500-6,000 వరకు ఉంటుంది. అదే 35 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే రూ.7,000-7,500 వరకు ఉంటుంది. 45 ఏళ్ల వ్యక్తి పాలసీ తీసుకుంటే రూ.8,500-9,000 వరకు ఉంటుంది. అదే 60 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ పాలసీ తీసుకుంటే రూ.15,000-21,000 వరకు అవుతుంది. అందుకే చిన్నవయసులోనే పాలసీ తీసుకోవడం ఉత్తమం.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో కొన్ని వ్యాధులకు 30 నుంచి 90 రోజుల వరకు వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి క్లెయిమ్స్‌ చేయలేరు. బీమా కంపెనీలు కనీసం 10-15 జబ్బులకు వెయిటింగ్‌ పీరియడ్‌ను అప్లై చేస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో ఈ వెయిటింగ్‌ పీరియడ్‌ అధికంగా ఉంటుంది. యవ్వనంలోనే ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు నిర్ణయం తీసుకుంటే మెడికల్‌ ఎమర్జెన్సీ గురించి చింతించకుండా వెయిటింగ్‌ పీరియడ్‌ను సులభంగా దాటేయొచ్చు.

ఇటీవల ఐఆర్‌డీఏ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి వయోపరిమితిని తొలగించింది. దీంతో ఇప్పుడు ఏ వయసువారైనా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు. ఇందుకోసం రకరకాల ప్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. అంతేకాదు మార్కెట్‌లో ఆయా కంపెనీల ఏజెంట్లు కూడా ఉన్నారు. ఆన్‌లైన్‌లో కానీ ఆఫ్‌లైన్‌లో ఎక్కడనా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవచ్చు. కానీ తీసుకునే ముందు పాలసీ రుసుము, పీరియడ్‌, వ్యాధులు, హాస్పిటల్స్‌ మొదలైన వివరాలను గమనించి తీసుకోవడం ఉత్తమం. ఇక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అనేది ఒక వ్యక్తి సంపాదించడం మొదలుపెట్టిన వెంటనే తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల ఆ వ్యక్తికి అన్ని రకాల సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories