లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని మధ్యలోనే సరెండర్ చేస్తున్నారా..! ఏం జరుగుతుందో తెలుసా..?

Are you Surrendering Your Life Insurance Policy in the Middle Find out These Things
x

representational Image

Highlights

Surrender Policy: లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీలకు చాలా కంపెనీలు ఉన్నాయి. ఇవి పాలసీలను బట్టి నియమ, నిబంధనలను రూపొందిస్తాయి.

Surrender Policy: లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీలకు సంబంధించి చాలా కంపెనీలు ఉన్నాయి. ఇవి పాలసీలను బట్టి వాటి నియమ, నిబంధనలను రూపొందిస్తాయి. అయితే ఒక పాలసీదారుడు పాలసీ తీసుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల ఒక్కోసారి పాలసీని సరెండర్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కంపెనీలు ఎలా వ్యవహరిస్తాయి. సరెండర్‌ మొత్తాన్ని ఎలా లెక్కిస్తారు. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

పాలసీ సరెండర్ చేసిన తర్వాత సరెండర్‌ మొత్తాన్ని పొందేందుకు బీమా కంపెనీ నిర్ణయించిన నిబంధనలను పాటించాలి. అంతేకాదు సరెండర్ ఛార్జీని చెల్లించాలి. ఇది ఒక్కో బీమా సంస్థకి ఒక్కో విధంగా ఉంటుంది. ఇది పాలసీ రకం, చెల్లించిన ప్రీమియం, మొత్తం ప్రీమియం చెల్లింపు వ్యవధి వంటి ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.మీకు వచ్చే మొత్తం నుంచి సరెండర్ ఛార్జీ తీసివేస్తారు. ఇది పాలసీని బట్టి మారుతూ ఉంటుంది. జీవిత బీమా పాలసీ సరెండర్ విలువ ఎలా లెక్కిస్తారో చూద్దాం.

సరెండర్ విలువ అంటే ఏమిటి?

సరెండర్ విలువ అనేది పాలసీని మెచ్యూరిటీ కాలానికి ముందే రద్దు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, జీవిత బీమా సంస్థ నుంచి పాలసీదారు పొందే మొత్తం. ఆ సందర్భంలో సంపాదన, పొదుపు కోసం కేటాయించిన మొత్తం అతనికి అందిస్తారు. దీని నుంచి పాలసీని బట్టి సరెండర్ ఛార్జీ తీసివేస్తారు.

సరెండర్ విలువ రకాలు ఏమిటి

సరెండర్ విలువలో రెండు రకాలు ఉంటాయి. గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ, స్పెషల్ సరెండర్ వాల్యూ. గ్యారెంటీడ్ సరెండర్ విలువ మూడేళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే పాలసీదారుకు చెల్లిస్తారు. ఈ విలువ ప్లాన్ కోసం చెల్లించిన ప్రీమియంలో 30% వరకు మాత్రమే ఉంటుంది. అలాగే ఇందులో మొదటి సంవత్సరానికి చెల్లించిన ప్రీమియంలు, రైడర్‌లకు చెల్లించే అదనపు ఖర్చులు, బోనస్‌లు ఉండవు. స్పెషల్ సరెండర్ వాల్యూని అర్థం చేసుకోవడానికి ఒక పద్దతి ఉంటుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి కొన్నిరోజులు ప్రీమియం చెల్లించకపోయినా పాలసీని కొనసాగించవచ్చు. కానీ తక్కువ హామీ మొత్తంతో దీనిని పెయిడ్-అప్ విలువ అంటారు. చెల్లించిన ప్రీమియమ్‌ల సంఖ్య, చెల్లించాల్సిన ప్రీమియంల సంఖ్యతో బేసిక్ సమ్ అష్యూర్డ్‌ను గుణించడం ద్వారా చెల్లించిన విలువ లెక్కిస్తారు.

పాలసీదారుడు పాలసీ సరెండర్ అభ్యర్థన ఫారమ్ నింపి బీమా కంపెనీకి సమర్పించాలి. అసలు పాలసీ పత్రం, రద్దు చేసిన చెక్కు, KYC పత్రాల స్వీయ-ధృవీకరణ కాపీని అప్లికేషన్‌తో జతచేయాలి. సరెండర్‌కి గల కారణాన్ని కూడా ఫారమ్‌లో పేర్కొనవలసి ఉంటుంది. సరెండర్ కోసం దరఖాస్తు సమర్పించిన తర్వాత అది సాధారణంగా 7-10 పని దినాలలో ప్రాసెస్ జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories