Mutual Funds: మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. ఇలా చేయండి చాలా ప్రయోజనాలు..!

Are you Investing in Mutual Funds do This Many Benefits
x

Mutual Funds: మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా.. ఇలా చేయండి చాలా ప్రయోజనాలు..!

Highlights

Mutual Funds: నేటి కాలంలో ప్రజలు చిన్న పెట్టుబడితో పెద్ద లాభం పొందాలనుకుంటారు.

Mutual Funds: నేటి కాలంలో ప్రజలు చిన్న పెట్టుబడితో పెద్ద లాభం పొందాలనుకుంటారు. దీనికి సరైన ఎంపిక మ్యూచువల్ ఫండ్స్‌. కానీ ఈ రోజుల్లో చాలా రకాల పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ FD, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మొదలైనవి ఉన్నాయి. వీటన్నింటిలో పెట్టుబడ సురక్షితంగా ఉంటుంది. కానీ చాలా తక్కువ రాబడిని పొందుతారు. అదే సమయంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా రిస్క్ ఉంటుంది. కానీ అధిక రాబడి ఉంటుంది.

మీరు తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ గొప్ప పెట్టుబడి ఎంపిక. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో గరిష్ట రాబడిని పొందాలనుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్‌లు గొప్ప పెట్టుబడి ఎంపిక అని చెప్పవచ్చు. మీరు ఏదైనా రంగానికి చెందిన పెద్ద కంపెనీలలో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే గరిష్ట రాబడిని పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటు నష్టం జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్. ఇది పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్స్‌లో గత కొన్నేళ్లుగా పెట్టుబడిదారులకు బలమైన రాబడిని అందిస్తున్న కంపెనీలు ఉన్నాయి. మీరు ఈ ఫండ్‌లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే తర్వాత మల్టీబ్యాగర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రయోజనాన్ని అందిస్తుంది. దీర్ఘకాలంలో అధిక రాబడిని ఇచ్చే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులకి పెద్ద క్యాప్ ఫండ్‌లు గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. చాలా మందికి ఇది చాలా కాలం తర్వాత ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత 5 నుంచి 7 సంవత్సరాలలో మీరు మంచి రాబడిని ఆశించవచ్చు. ఈ పరిస్థితిలో మీరు లార్జ్ క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories