Bank Transaction Details: అకౌంట్‌ నుంచి తరచుగా మనీ విత్‌డ్రా చేస్తున్నారా.. నియమాలు తెలియకుంటే నష్టపోతారు..!

Are you Frequently Withdrawing Money from the Account if you do not know the Rules you will lose
x

Bank Transaction Details: అకౌంట్‌ నుంచి తరచుగా మనీ విత్‌డ్రా చేస్తున్నారా.. నియమాలు తెలియకుంటే నష్టపోతారు..!

Highlights

Bank Transaction Details: కొంతమంది బ్యాంకు ఖాతా నుంచి తరచుగా మనీ విత్‌ డ్రా చేస్తుంటారు. కానీ తర్వాత జరిగే పర్యవసనాల గురించి ఆలోచించరు.

Bank Transaction Details: కొంతమంది బ్యాంకు ఖాతా నుంచి తరచుగా మనీ విత్‌ డ్రా చేస్తుంటారు. కానీ తర్వాత జరిగే పర్యవసనాల గురించి ఆలోచించరు. నిజానికి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును ఎవరైనా ఎప్పుడైనా ఎన్నిసార్లయినా తీసుకునే హక్కు ఉంటుంది. కానీ దీనివల్ల పన్ను కట్టాల్సిన ప్రమాదం పొంచి ఉంటుంది. నిర్ణీత పరిమితికి మించి డబ్బు విత్‌ డ్రా చేస్తే ట్యాక్స్‌ వర్తిస్తుంది. అందుకే బ్యాంకు నుంచి విత్‌ డ్రా చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం.

ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు

బ్యాంకు ఖాతా నుంచి ఎంత నగదు కావాలంటే అంత ఉచితంగా తీసుకోవచ్చని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే అతను TDS చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం నుంచి నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ డబ్బు తీసుకున్నందుకు బ్యాంకులు రుసుము వసూలు చేస్తాయి. పరిమితి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్‌కు రూ.21 వసూలు చేస్తున్నాయి.

గతంలో దీని కోసం రూ.20 చెల్లించాల్సి వచ్చేది. చాలా బ్యాంకులు తమ ATMల నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తాయి. ఇది కాకుండా ఇతర బ్యాంకుల ATMల నుంచి కూడా మూడు లావాదేవీలు ఉచితం. మెట్రో నగరాల్లో మీరు సొంత బ్యాంకు నుంచి ఉచితంగా మూడు సార్లు మాత్రమే డబ్బు తీసుకోవచ్చు. అందుకే అకౌంట్‌ నుంచి మనీ విత్‌ డ్రా చేసే విషయంలో జాగ్రత్తగా ప్లాన్‌ చేసి విత్‌ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories