Free Sewing Machine: ఫ్రీ కుట్టు మిషన్ దరఖాస్తు ఫారమ్ ఇదిగో..ఇలా నింపేయండి

Free Sewing Machine: ఫ్రీ కుట్టు మిషన్ దరఖాస్తు ఫారమ్ ఇదిగో..ఇలా నింపేయండి
x
Highlights

Free Sewing Machine: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్రీ కుట్టుమిషన్ ఇస్తామని తెలిపింది. కానీ దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు ఫామ్ కనిపించడం లేదని...

Free Sewing Machine: తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్రీ కుట్టుమిషన్ ఇస్తామని తెలిపింది. కానీ దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తు ఫామ్ కనిపించడం లేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే దీని గురించి ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఫ్రీగా కుట్టు మిషన్లు ఇవ్వనుంది. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి స్కీముంలో భాగంగా మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు ఫ్రీగా కుట్టుమిషన్ల ఇవ్వబోతుంది సర్కార్. దీనికోసం దరఖాస్తులు పెట్టుకునేందుకు వీలుగా దరఖాస్తును ఆన్ లైన్లో పెట్టింది. ఇప్పుడు చాలా సులభంగా దరఖాస్తును ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

ముందుగా (https://tgobmms.cgg.gov.in/sewingForm.action) ఇది ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్. ఇందులోకి లాగిన్ అవ్వాలి. అందులో డైరెక్టుగా దరఖాస్తు ఫామ్ ను ఓపెన్ చేయాలి. మీ వ్యక్తిగత వివరాలు, అడ్రస్, ఎటాచ్ మెంట్స్ విభాగాలను నింపాలి. ఆ తర్వాత ప్రివ్యూ చూసి సబ్‌మిట్ పై క్లిక్ చేయాలి. మీకు ఒక ఎక్నాలడ్జ్ మెంట్ కార్డు వస్తుంది. అందులో ఉండే ఐడీ నంబర్ ద్వారా మీ ఫారమ్ స్టేటస్ ను కూడా చెక్ చేసుకోవచ్చు.

అయితే ఫారమ్ లో తండ్రి పేరు, సంవత్సర ఆదాయం, రేషన్ కార్డు నెంబర్, పెళ్లి వివరాలు, మొబైల్ నెంబర్, మతం, టైలరింగ్ ట్రైనింగ్ కు సంబంధించి వివరాలు, ఆధార్ నెంబర్, పుట్టినరోజు, చదువు, జెండర్ వంటి వివరాలను అడుగుతారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఫొటోగ్రాఫ్, ట్రైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా అప్ లోడ్ చేయాలి. ఇదంతా ఇంట్లోనే మొబైల్ ద్వారా చేసుకోవాలి. లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి కూడా చేసుకోవచ్చు.

ఆన్ లైన్ ఫారమ్ నింపడం కుదరకుంటే అర్హులైన మహిళలు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దగ్గరకు వెళ్లి దరఖాస్తు ఫారం తీసుకుని దాన్ని చేసి చేసి అందులో ఆధారాలకోసం అడిగిన ఐడీ జిరాక్సు పత్రాలను కూడా జతచేసి తిరిగి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి ఇవ్వాలి. ఇలా వారు ఈ వివరాలను ఆన్ లైన్ లో ఎంటర్ చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories