Reliance Power Share: జాక్ పాట్ కొట్టిన అనిల్ అంబానీ.. రిలయన్స్ పవర్ షేర్లకు రెక్కలు

Anil Ambanis company Reliance Power wins new 500 MW battery storage contract marks
x

Reliance Power Share: జాక్ పాట్ కొట్టిన అనిల్ అంబానీ.. రిలయన్స్ పవర్ షేర్లకు రెక్కలు

Highlights

Reliance Power Share: ఆసియాలొనే నెంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కంపెనీకి మంచి రోజులు వచ్చాయి. తాజాగా ఆయన కంపెనీకి ఒక భారీ ఆర్డర్ వచ్చింది. దీంతో ఆ కంపెనీ షేర్లలో భారీ జంప్ కనిపిస్తోంది.

Reliance Power Share: ఆసియాలొనే నెంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ కంపెనీకి మంచి రోజులు వచ్చాయి. తాజాగా ఆయన కంపెనీకి ఒక భారీ ఆర్డర్ వచ్చింది. దీంతో ఆ కంపెనీ షేర్లలో భారీ జంప్ కనిపిస్తోంది. సోమవారం రిలయన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకాయి. నిన్న రిలయన్స్ పవర్ షేర్లలో రూ.30.30 వద్ద ప్రారంభమైన ట్రేడింగ్ తర్వాత రూ.31.32 స్థాయికి చేరుకుంది. అయితే ట్రేడింగ్‌లో రిలయన్స్ పవర్ షేరు రూ.30.72 వద్ద ముగిసింది. స్టాక్ పెరగడం వల్ల కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.12490 కోట్లకు పెరిగింది.

అనిల్ అంబానీకి చెందిన ఈ కంపెనీకి పెద్ద ఆర్డర్ వచ్చిన వార్తల నేపథ్యంలో తర్వాత షేర్లలో పెరుగుదల కనిపించింది. సెప్టెంబర్ 11న జరిగిన వేలం తర్వాత రిలయన్స్ పవర్ 500మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఆర్డర్‌ను అందుకుంది. రిలయన్స్ పవర్ కాకుండా, చాలా కంపెనీలు ఈ వేలం కోసం వేలం వేయగా అనిల్ అంబానీ గెలిచారు. ఆర్డర్‌ను స్వీకరించిన వార్త తర్వాత, రిలయన్స్ పవర్ షేర్‌లు అకస్మాత్తుగా అప్పర్ సర్క్యూట్ తాకాయి.

ఇదిలా ఉంటే ఐదేళ్లలో రిలయన్స్ పవర్ షేర్లు 959% బలమైన రాబడి అందించాయి. సెప్టెంబర్ 20, 2019న, రిలయన్స్ పవర్ ఒక షేరు ధర రూ.2.90 మాత్రమే ఉంది. కానీ అది ఇప్పుడు రూ.31 దాటింది. ఈ లెక్కన చూస్తే, ఒక ఇన్వెస్టర్ సెప్టెంబర్ 20, 2019న రిలయన్స్ పవర్ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టి, ఇప్పటి వరకు ఉంచి ఉంటే, అప్పటికి అతని మొత్తం రూ.10,59,000కి పెరిగి ఉండేది.

ఒకవైపు రిలయన్స్ పవర్ ఇన్వెస్టర్ల డబ్బు గత ఐదేళ్లలో 10 రెట్లు పెరిగితే, మరోవైపు ఈ మల్టీబ్యాగర్ స్టాక్ గత ఏడాది పనితీరును పరిశీలిస్తే . రూ. 19.10 నుంచి రూ. 31.32కి చేరుకుంది అంటే ఇన్వెస్టర్లకు 60.84 శాతం రాబడి వచ్చింది. అదే సమయంలో, గత ఆరు నెలల్లో కూడా ఇది వాటాదారులకు లాభాలను అందుకున్నారు.

రిలయన్స్ పవర్ లిమిటెడ్ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీ. రిలయన్స్ గ్రూప్ ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలు ఇంధనంతో సహా అనేక రంగాలలో పనిచేస్తుంది. రిలయన్స్ పవర్ భారతదేశంలో పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణం నిర్వహణ కోసం పనిచేస్తుంది. దీనికి కొన్ని అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. కంపెనీకి దాదాపు 6000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆస్తులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories