Tata Group: సైరస్ మిస్త్రీ ప్రమాద ఘటన.. ప్రతిజ్ఞ చేసిన ఆనంద్ మహీంద్రా..
Tata Group: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతిచెందారు.
Tata Group: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతిచెందారు. నిన్న ముంబై దగ్గర్లోని ఫాల్ఘర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మిస్త్రీ కన్నుమూశారు. ఆయన మృతిపై దేశం సంతాపం వ్యక్తం చేస్తోంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన తీరుతో మితిమీరినవేగం, సీట్ బెల్ట్ పెట్టుకోకవడం తదితర అంశాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
'నేను కారులో ఏ సీట్లో కూర్చున్నా సీటు బెల్టు ధరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా..మీరుకూడా ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా..మనమందరం మన కుటుంబాలకు రుణపడి ఉన్నాం.' అని ట్వీట్ చేశారు. చాలామంది ట్విటర్ వినియోగదారులు దీనిపై సానుకూలంగా స్పందించారు. తాము కూడా ప్రతిజ్ఙ చేస్తున్నామని చెప్పారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని భద్రతా నియమాలను పాటిస్తామని కామెంట్ చేశారు.
I resolve to always wear my seat belt even when in the rear seat of the car. And I urge all of you to take that pledge too. We all owe it to our families. https://t.co/4jpeZtlsw0
— anand mahindra (@anandmahindra) September 5, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire