Amul Milk: అమూల్‌ పాల ధరల పెంపు.. కొత్త ధరలు ఇలా..!

Amul Hikes Milk Prices By 2 Rupees Per Litre
x

Amul Milk: అమూల్‌ పాల ధరల పెంపు.. కొత్త ధరలు ఇలా..!

Highlights

Amul Milk: దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’ కీలక నిర్ణయం తీసుకుంది.

Amul Milk: దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ 'అమూల్‌' కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది తొలిసారి అమూల్ పాల ధరలను పెంచింది. లీటర్‌పై రూ.2 వరకు పెంచుతున్నట్లు అమూల్ కంపెనీ తెలిపింది. పెరుగుతున్న ఉత్పత్తి ధరల దృష్ట్యా పాల ధరను పెంచినట్లు వెల్లడించింది. శుక్రవారం నుంచి అమూల్ పాలు లీటరుపై రూ.2 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది. గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్‌ సీనియర్‌ మేనేజర్‌ (సేల్స్‌) ప్రకాశ్‌ ఆటే తెలిపారు.

తాజా పెంపుతో లీటర్‌ పాల ధరలు ఇలా ఉన్నాయి..

అమూల్‌ తాజా- రూ.54

అమూల్‌ గోల్డ్‌- రూ.66

అమూల్‌ ఆవు పాలు- రూ.56

అమూల్‌ ఏ2 గేదె పాలు- రూ.70

Show Full Article
Print Article
Next Story
More Stories