Amazon Great Republic Day Sale: జనవరి 13 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్..వీటిపైనే ప్రత్యేక ఆఫర్లు

Amazon Great Republic Day Sale: జనవరి 13 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్..వీటిపైనే ప్రత్యేక ఆఫర్లు
x
Highlights

Amazon Great Republic Day Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మీకు అనేక డిస్కౌంట్ ఆఫర్‌లు...

Amazon Great Republic Day Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో మీకు అనేక డిస్కౌంట్ ఆఫర్‌లు అందుబాటులో ఉండనున్నాయి. మీరు కూడా మంచి షాపింగ్ చేసి తక్కువ డబ్బుతో చాలా ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకుంటే ఇదొక బిగ్ ఛాన్స్ అని చెప్పవచ్చు. అందుకే ముందుగానే షాపింగ్ లిస్ట్ సిద్ధం చేసుకోండి.

అమెజాన్ మరోసారి తన కస్టమర్లకు బంపర్ సేవింగ్ అవకాశాన్ని కల్పిస్తోంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025 జనవరి 13 నుండి ప్రారంభం కానుంది . ఈ సేల్‌లో మీకు ఇష్టమైన దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్‌లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రిపబ్లిక్ డే సేల్‌లో మీరు SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

ప్రైమ్ మెంబర్‌లు ఈ అమెజాన్ సేల్‌కు 13 జనవరి అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభ యాక్సెస్‌ను పొందుతారు. ఆపై మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ సేల్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాదు కొన్ని ప్రత్యేక డీల్‌లు కూడా ప్రత్యక్షంగా ఉంటాయి. వీటిలో 8 PM డీల్, బడ్జెట్ బజార్, బ్లాక్‌బస్టర్ డీల్స్, ప్రీ-బుక్ కోసం ఆప్షన్స్ ఉంటాయి.

జనవరి 19 వరకు ఈ సేల్ కొనసాగే ఛాన్స్ ఉంది.సేల్ కు సంబంధించి అమెజాన్ ఇప్పటికే మైక్రోసైట్ ను కూడా సిద్ధం చేసింది. మరికొన్నింటిని టీజ్ చేస్తోంది. స్మార్ట్ ఫోన్లకు సంబంధించి యాపిల్, ఐకూ, వన్ ప్లస్, శాంసంగ్, రియల్ మీ, రెడ్ మీ మొబైల్స్ పై డీల్స్ ఉండనున్నాయి. ముఖ్యంగా వన్ ప్లస్ నార్డ్ 4, సీఈ 4, నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఎంత వరకు డిస్కౌంట్స్ ఉంటాయో వెల్లడించలేదు.

నేడు లాంచ్ కానున్న వన్ ప్లస్ 13, 13ఆర్ ఫోన్లపై కూడా ఈ సేల్ లోనే విక్రయానికి రానున్నాయి. అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవీ డివైజులపైనా ఈ సేల్ లో డిస్కౌంట్లు అందుబాటులో ఉండబోతున్నాయి. ఫైర్ టీవీ స్టిక్ లైట్ ను రూ. 2599, ఎకో పాప్ రూ. 3, 949 , ఎకో ఫోర్త్ జనరేషన్ రూ. 7, 549కి విక్రయించనున్నారు. ఇక స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ యాక్సెసరీ్, హోం అప్లయెన్సెస్ పైనా కూడా ఆఫర్లు ఉంటాయని అమెజాన్ చెబుతోంది. సేల్ కు కొద్ది రోజుల ముందు ఆఫర్ల వివరాలను వెల్లడించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories