Business Idea: ఈ బిజినెస్‌తో మీకు తిరుగే ఉండదు.. తక్కువ పెట్టుబడితోనే..!

Aluminium Foil Container Manufacturing Business Ideas in Telugu
x

Business Idea: ఈ బిజినెస్‌తో మీకు తిరుగే ఉండదు.. తక్కువ పెట్టుబడితోనే..!

Highlights

Business Idea: వ్యాపారంలో లాభ, నష్టాలు సర్వసాధారణం. అయితే మనలో చాలా మంది వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా, ఎక్కడ నష్టం వస్తుందో అన్న భయంతో వెనుకడుగు వేస్తుంటారు.

Business Idea: వ్యాపారంలో లాభ, నష్టాలు సర్వసాధారణం. అయితే మనలో చాలా మంది వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా, ఎక్కడ నష్టం వస్తుందో అన్న భయంతో వెనుకడుగు వేస్తుంటారు. అందులోనూ భారీగా పెట్టుబడి పెట్టి నష్టం వస్తే ఎలా అని భయపడుతుంటారు. కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టం అనే సమస్యే ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్లో అలా నిత్యం డిమాండ్‌ ఉండే బిజినెస్‌లో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ బెస్ట్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో బయటి ఫుడ్‌ తీసుకోవడం ఒక అవసరంగా మారిపోయింది. ఇంట్లో భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుండడంతో టిఫిన్‌ మొదలు డిన్నర్‌ వరకు బయట చేసే వారి సంఖ్య పెరుగుతోంది. లేదంటే ఇంటికి పార్శిల్ తెచ్చుకుంటున్నారు. ఈ పార్శిల్స్‌ చేయడానికి ఉపయోగించే అల్యూమినియం ఫాయిల్స్‌తో చేసే కవర్స్‌, బాక్స్‌లకు డిమాండ్ పెరుగుతోంది.

అల్యూమినియం ఫాయిల్స్‌ బాక్స్‌లకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. వీటి తయారీనే మన బిజినెస్‌ ఐడియాగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. ఇంతకీ ఈ బిజినెస్ ప్రారంభించేందుకు ఎంత ఖర్చవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అల్యూమినియం ఫాయిల్‌ బాక్స్‌ను తయారి బిజినెస్‌ ప్రారంభించేందుకు సుమారు రూ. 8 నుంచి రూ. 10 లక్షల ఖర్చు అవుతుంది. దీనిని రుణంలా కూడా పొందొచ్చు.

అల్యూమినియం ఫాయిల్‌ తయారీకి అవసరమయ్యే మిషిన్స్‌తో పాటు ముడి సరుకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మిషన్‌ ధర సుమారు రూ. 6 లక్షల నుంచి మొదలవుతుంది. ముందుగా అల్యూమినియం షీట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ఆ తర్వాత మీరు ఏ షేప్‌లో బాక్స్‌ను తయారు చేయాలనుకుంటున్నారో డై సహాయంతో చేయొచ్చు. ఇక లాభాల విషయానికొస్తే.. తక్కువలో తక్కువ నెలకు రూ. లక్షన్నరపైగానే సంపాదించవచ్చు. మంచి మార్కెటింగ్ చేసుకొని సొంత బ్రాండిండ్‌పై విక్రయిస్తే లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories