Education Loan: విద్యార్థులకి అలర్ట్‌.. ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకునేటప్పుడు ఈ ఛార్జీలని గమనించండి..!

Alert To Students Note These Charges While Taking Education Loan
x

Education Loan:విద్యార్థులకి అలర్ట్‌.. ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకునేటప్పుడు ఈ ఛార్జీలని గమనించండి..!

Highlights

Education Loan: చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి ఎడ్యుకేషన్‌ లోన్‌పై ఆధారపడుతారు.

Education Loan: చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి ఎడ్యుకేషన్‌ లోన్‌పై ఆధారపడుతారు. ఇండియాలో నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు ఎడ్యుకేషన్‌ లోన్‌ మంజూరుచేస్తారు. అయితే ఈ లోన్లని తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇతర ఛార్జీలు యాడ్‌ చేసి తడిసి మోపెడు చేస్తారు. మీరు ఒకవేళ ఎడ్యుకేషన్‌ లోన్‌ గురించి ఆలోచిస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి.

ప్రాసెస్‌ ఫీజు

ఎడ్యుకేషన్‌ లోన్‌ అప్లై చేసినప్పుడు బ్యాంకులు ప్రాసెస్‌ ఫీజుని వసూలుచేస్తాయి. చాలా మంది బ్యాంకులు ఈ ఛార్జీలని నేరుగా విధిస్తాయి. అయితే మరికొన్ని బ్యాంకులు ప్రాసెస్‌ ఫీజుకి అదనంగా సర్వీస్ ఛార్జీని కూడా కలుపుతాయి. ఇది రుణ ఖర్చును మరింత పెంచుతుంది.

ప్రీ పేమెంట్‌ ఛార్జ్‌

విద్యార్థులు లోన్‌ తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు, ఖాతాను ముందస్తుగా ఫోర్‌క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ప్రీ పేమెంట్‌ ఛార్జ్‌ విధిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ ఛార్జీలని విధిస్తాయి. అందుకే ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకునేటప్పుడు బ్యాంకు నిబంధనలని తెలుసుకోవడం ముఖ్యం.

ఆలస్య రుసుము

EMIని సకాలంలో చెల్లించడంలో విఫలమైనప్పుడు ఆలస్య చెల్లింపు రుసుము విధిస్తారు. చాలా బ్యాంకులు EMI మొత్తంలో 2 నుంచి 3 శాతం, GST వసూలు చేస్తాయి.

లోన్‌ ఇన్సూరెన్స్‌

మీరు లోన్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోకపోతే బ్యాంకులు వడ్డీ రేటును పెంచుతాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది 0.05 శాతం నుంచి 0.25 శాతం అలాగే ప్రైవేట్ బ్యాంకుల్లో 2 శాతం వరకు ఉంటుంది.

తనఖా ఛార్జ్

ఆస్తులని తాకట్టుపెట్టి ఎడ్యుకేషన్‌లోన్‌ తీసుకున్నప్పుడు బ్యాంకులు ఈ ఛార్జీలను విధిస్తాయి. ఈ ఛార్జీలు రుణ మొత్తంలో 0.25% నుంచి 0.5% వరకు ఉంటాయి.అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రుణాల విషయంలో ఈ తనఖా ఛార్జీలను మాఫీ చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories