PM Kisan: రైతులకి అలర్ట్‌.. సీజన్‌కి ముందే 14వ విడత.. ఎప్పుడంటే..?

Alert to Farmers PM Kisan 14th Installment Money Before Kharif Season
x

PM Kisan: రైతులకి అలర్ట్‌.. సీజన్‌కి ముందే 14వ విడత.. ఎప్పుడంటే..?

Highlights

PM Kisan: దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్‌ 14వ విడత కోసం ఎదురుచూస్తున్నారు.

PM Kisan: దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్‌ 14వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే త్వరలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంకానుంది. రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్న, చిన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాల కోసం డబ్బు అవసరం అవుతుంది. ప్రభుత్వం ముందుగా 14వ విడత విడుదల చేస్తే రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 14వ విడతను విడుదల చేయనుంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది కేంద్ర రంగ పథకం. సన్న, చిన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికింద బీజేపీ ప్రభుత్వం ఏటా రైతులకు రూ.6000 అందజేస్తుంది. ఈ మొత్తాన్ని రైతులకు మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో 2-2 వేల చొప్పున విడతల వారీగా అందజేస్తుంది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాలకు వెళుతుంది.

14వ విడత ఎప్పుడంటే..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఇప్పటి వరకు 13 వాయిదాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఇప్పుడు 14వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం 14వ విడత మే చివరి వారంలో లేదా జూన్ మొదట్లో విడుదల కావచ్చు. ఇకపై రైతులు దీనికోసం పెద్దగా ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఒక నెలలోపు మొత్తం అతని ఖాతాకు జమవుతుంది. దీని కోసం వారు తమ అన్ని పత్రాలను అప్‌డేట్‌ చేయాలని గుర్తుంచుకోండి.

పేరును ఇలా తనిఖీ చేయండి..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 13వ విడతను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.16 వేల 800 కోట్లు వెచ్చించింది. 13వ విడతలో 8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. రైతు సోదరులు 14వ విడత పీఎం కిసాన్ జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవాలనుకుంటే పీఎం కిసాన్ PM kisan.go.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ పేరును తనిఖీ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories