Onion Prices: వినియోగదారులకు అలర్ట్‌.. ఉల్లి ధరలు దిగి వస్తున్నాయి..!

Onion Prices: వినియోగదారులకు అలర్ట్‌.. ఉల్లి ధరలు దిగి వస్తున్నాయి..!
x

Onion Prices: వినియోగదారులకు అలర్ట్‌.. ఉల్లి ధరలు దిగి వస్తున్నాయి..!

Highlights

Onion Prices: గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Onion Prices: గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా టమోటా ధరలు తగ్గితే ప్రస్తుతం ఉల్లి ధరలు పెరిగాయి.పెరుగుతున్న ఉల్లి ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశీయంగా ఉల్లి లభ్యతను పెంచేందుకు, ధరలను నియంత్రించేందుకు వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లి ఎగుమతులు నిషేధించింది. ప్రస్తుతం ఢిల్లీలోని స్థానిక కూరగాయల వ్యాపారులు కిలో ఉల్లిని రూ.70నుంచి 80కి విక్రయిస్తున్నారు.

రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లిరూ.25

వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం బఫర్ ఉల్లి స్టాక్‌ను కిలోకు 25 రూపాయల రాయితీపై రిటైల్ మార్కెట్‌లో విక్రయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతిపై టన్నుకు కనీస ఎగుమతి ధర (ఎంఈపీ) 800 డాలర్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి అయింది.

ఎగుమతి విలువ పరంగా మొదటి మూడు దిగుమతి దేశాలు బంగ్లాదేశ్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE). ఖరీఫ్‌ సీజన్‌లో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గుతుందన్న వార్తల నేపథ్యంలో వాటి ధరలు పెరగడం ప్రారంభించాయి. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం కూరగాయలు, బంగాళదుంపల ద్రవ్యోల్బణం వరుసగా 21.04 శాతం, తగ్గింది. ఉల్లి వార్షిక ధర వృద్ధి రేటు 62.60 శాతం గరిష్ట స్థాయిలో కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories