HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు చెందిన 12 కోట్ల మంది కస్టమర్లకు అలర్ట్.. ఈ సేవలు బంద్..!

Alert to 12 Crore Customers of HDFC Bank These Services not be Available for Two Days
x

HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు చెందిన 12 కోట్ల మంది కస్టమర్లకు అలర్ట్.. ఈ సేవలు బంద్..!

Highlights

HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 14, 15 తేదీలకు సంబంధించి తన వినియోగదారులను అలర్ట్ చేసింది.

HDFC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 14, 15 తేదీలకు సంబంధించి తన వినియోగదారులను అలర్ట్ చేసింది. మెయింటెనెన్స్, క్రెడిట్ కార్డ్ లావాదేవీల కారణంగా.. ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, ఎన్ ఈఎఫ్ టీ, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు, డీమ్యాట్ లావాదేవీలు వంటి నెట్ బ్యాంకింగ్ సేవలు ఈ రెండు రోజుల్లో తాత్కాలికంగా నిలిచిపోవచ్చని హెచ్ డీఎఫ్ఎసీ బ్యాంక్ తెలియజేసింది. హెచ్‌డిఎఫ్‌సి(HDFC) బ్యాంక్ తన కస్టమర్‌లకు ఎలాంటి అప్‌డేట్ ఇచ్చిందో వివరంగా తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్(Credit Card) లావాదేవీలు 14 డిసెంబర్ 2024న మధ్యాహ్నం 1 నుండి 1.30 వరకు 30 నిమిషాల పాటు మూసివేయబడతాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల సేవ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు దాదాపు 3 గంటల పాటు క్లోజ్ అవుతాయి. ఖాతా సంబంధిత వివరాలు, డిపాజిట్లు, ఫండ్ బదిలీలు (UPI, IMPS, NEFT, RTGS), బిజినెస్ ట్రాన్సాక్షన్లు, ఇన్ స్టాంట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియ వంటి సౌకర్యాలు కూడా మూసివేయబడతాయి. ఉదయం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రెండు గంటల పాటు డీమ్యాట్ లావాదేవీ సౌకర్యం అందుబాటులో ఉండదు.

డిసెంబర్ 14 నుండి 15 డిసెంబర్ 2024 మధ్య అంటే డిసెంబర్ 14వ తేదీ రాత్రి 10 గంటల నుండి 15 డిసెంబర్ 2024 మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే 14 గంటల వరకు, నెట్ బ్యాంకింగ్‌లో ఆఫర్ ట్యాబ్ సదుపాయం అందుబాటులో ఉండదు. డిసెంబర్ 15, 2024న, కొత్త నెట్ బ్యాంకింగ్‌లో భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అంటే 4 గంటల వరకు మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు ఉండవు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తమ ఖాతాదారులకు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్ ఇటీవల తన కస్టమర్లకు రాబోయే షెడ్యూల్ మెయింటెనెన్స్ గురించి ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ నిర్వహణ వ్యవధిలో RTGS లావాదేవీలు తాత్కాలికంగా మూసివేయబడతాయి. ఐసీఐసీఐ బ్యాంక్ నిర్వహణ పని డిసెంబర్ 14 రాత్రి 11:55 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 15, 2024 ఉదయం 06:00 గంటల వరకు కొనసాగుతుంది. ఈ వ్యవధిలో ప్రారంభించబడిన RTGS లావాదేవీలు వాయిదా వేయబడతాయి. డిసెంబర్ 15, 2024 ఉదయం 06:00 గంటల తర్వాత ప్రాసెస్ చేయబడతాయి. బ్యాంక్ కస్టమర్‌లు ఈ కాలంలో ప్రత్యామ్నాయాలుగా iMobile లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో NEFT, IMPS లేదా UPIని ఉపయోగించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories