SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకి అలర్ట్‌.. మరో 2 రోజుల్లో ఈ స్కీం క్లోజ్‌..!

Alert SBI Customers SBI Utsav Deposit Will be Closed in Next 2 Days
x

SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకి అలర్ట్‌.. మరో 2 రోజుల్లో ఈ స్కీం క్లోజ్‌..!

Highlights

SBI Alert: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

SBI Alert: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ 'ఉత్సవ్ డిపాజిట్' పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. ఇందులో కస్టమర్లు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతున్నారు. వడ్డీ రేట్లు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంది. దీని చివరి తేదీ అక్టోబర్ 28 అని గుర్తుంచుకోండి.

ఈ సందర్భంగా ఎస్బీఐ సమాచారాన్ని అందజేస్తూ అక్టోబర్ 28 వరకు కస్టమర్లు 'ఉత్సవ్ డిపాజిట్' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. అంటే ఈ గొప్ప ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాస్తవానికి ఆగస్ట్ 15 నుంచి 75 రోజుల పాటు అమలులో ఉన్న ఉత్సవ్ డిపాజిట్ పథకం అక్టోబర్ 28న ముగుస్తుంది.

ఈ పథకం ప్రత్యేకత ఏమిటి?

ఎస్బీఐ అందించిన సమాచారం ప్రకారం.. ఉత్సవ్ FD పథకంలో 1,000 రోజుల డిపాజిట్లపై 6.10% p.a. వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50% అదనపు వడ్డీ రేటును అందిస్తోంది. ఈ రేట్లు 15 ఆగస్టు 2022 నుంచి అమలులోకి వస్తాయి. ఈ ద్రవ్యోల్బణం కాలంలో సురక్షితమైన పెట్టుబడిని చేయాలనుకుంటే ఈ ప్రత్యేక పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories