Aadhaar Charges: ఆధార్ అప్‌డేట్‌, ఇతర మార్పులకి ఛార్జీలు ఎంతంటే..?

Aadhaar Update and Other Changes Charges Check for all Details
x

Aadhaar Charges: ఆధార్ అప్‌డేట్‌, ఇతర మార్పులకి ఛార్జీలు ఎంతంటే..?

Highlights

Aadhaar Charges: ఆధార్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం కొంత రుసుము చెల్లించాలి.

Aadhaar Charges: ఆధార్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం కొంత రుసుము చెల్లించాలి. ఈ రుసుము యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిర్ణయిస్తుంది. ఈ ఛార్జీల గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. దీనివల్ల ఆధార్‌ కేంద్రానికి వెళ్లినప్పుడు ఎటువంటి మోసానికి గురికాకుండా ఉంటారు. ఇటీవల ఆధార్‌ మార్పునకు ఎక్కువగా రుసుము వసూలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కస్టమర్ సర్వీస్ సెంటర్లలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ. కాబట్టి ఆధార్ అప్‌డేట్ ఛార్జీల గురించి తెలుసుకుందాం.

1.ఆధార్ సంఖ్య జనరేషన్ (0-5 సంవత్సరాలు) ఉచితం

2.ఆధార్ సంఖ్య జనరేషన్ (5 ఏళ్లు పైబడిన వారు)ఉచితం

3.బయోమెట్రిక్ అప్‌డేట్-ఉచితం

4.ఇతర బయోమెట్రిక్ అప్‌డేట్‌లు (డెమోగ్రాఫిక్ అప్‌డేట్‌లతో లేదా లేకుండా) రూ.100

5.జనాభా నవీకరణ 50 రూపాయలు

6.గుర్తింపు రుజువు లేదా నివాస రుజువులో అప్‌డేట్- 50 రూపాయలు

7.eICYC ద్వారా ఆధార్ శోధన-30 రూపాయలు

8.గుర్తింపు లేదా నివాస ధృవీకరణ పత్రం అప్‌డేట్ - 25 రూపాయలు

బాల్‌ ఆధార్‌ కార్డు

పిల్లల ఆధార్ కార్డును బాల్ ఆధార్ అంటారు. పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. పిల్లల ఆధార్ సమాచారం తల్లిదండ్రుల ఆధారంగా ఉంటుంది. పిల్లల ఆధార్‌కి తల్లిదండ్రుల వివరాలను అనుసంధానం చేస్తారు. పిల్లవాడు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు అతని చేతుల పది వేళ్లు, ఐరిస్, ఫేస్‌ రికగ్నైషేజన్‌ అప్‌డేట్‌ చేస్తారు. తర్వాత ఈ వివరాలు ఒరిజినల్ ఆధార్ లెటర్‌లో అప్‌డేట్ అవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories