Ration Card: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోపు ఇలా చేయకుంటే.. ఉచిత రేషన్ కట్..!

Aadhaar Card and Ration Card Linking Deadline Extend Till 30th June 2023 Check Online and Off Line Steps
x

Ration Card: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. జూన్ 30లోపు ఇలా చేయకుంటే.. ఉచిత రేషన్ కట్..!

Highlights

Ration Card Update: మీకు రేషన్ కార్డ్ ఉండి, ప్రభుత్వ ఉచిత రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా.. అయితే, ఈ వార్త మీకోసమే.

Ration Card- Aadhaar Card Linking: మీకు రేషన్ కార్డ్ ఉండి, ప్రభుత్వ ఉచిత రేషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా.. అయితే, ఈ వార్త మీకోసమే.. రేషన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిరంతరం కోరుతోంది. అయితే ఇప్పటి వరకు కోట్లాది రేషన్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. మీ రేషన్ కార్, ఆధార్ లింక్ చేయకపోతే, రేషన్ కార్డును ప్రభుత్వం రద్దు చేస్తుంది. ఇంతకు ముందు దీని చివరి తేదీ మార్చి 31, 2023 వరకు నిర్ణయించింది. ఇది ఇప్పుడు జూన్ 30, 2023 వరకు పొడిగించారు.

అనుసంధానం చేయకుంటే రేషన్ కార్డు రద్దు..

జూన్ 30, 2023లోపు రేషన్ కార్డ్, ఆధార్ లింక్ చేయకపోతే, మీ రేషన్ కార్డ్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. జులై 1 నుంచి మీకు రేషన్‌లో లభించే గోధుమ-బియ్యం కూడా ఇకపై లభించదు. రేషన్ కార్డ్ రద్దుతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ కాకుండా, రేషన్ కార్డును గుర్తింపు, చిరునామా రుజువుగా ఉపయోగించవచ్చు.

జూన్ 30, 2023లోపు ఈ పనిని పూర్తి చేయాలి.

రేషన్ కార్డ్‌తో ఆధార్‌ని లింక్ చేయడం ద్వారా, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డ్‌లను పొందకుండా ప్రభుత్వం నిరోధించగలదు. దీనితో, అధిక ఆదాయ పరిమితి కారణంగా రేషన్ పొందడానికి అనర్హులుగా ఉన్న వారిని గుర్తించవచ్చు. ఇది అర్హులైన వ్యక్తులు మాత్రమే సబ్సిడీ గ్యాస్ లేదా రేషన్ పొందేలా చూస్తుంది.

డూప్లికేట్ రేషన్ కార్డులు, మధ్య దళారుల యథేచ్ఛను తగ్గించడంలోనూ ఈ రెండింటినీ అనుసంధానం చేయడం సాయపడుతుంది. మీరు ఇంకా మీ రేషన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకుంటే, జూన్ 30, 2023లోపు ఈ పనిని పూర్తి చేయాలి.

ఆన్‌లైన్‌లో రేషన్ కార్డ్‌కి ఆధార్‌ను ఎలా లింక్ చేయాలంటే..

* పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

* ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి.

* రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

* OTPని నమోదు చేసి, రేషన్ కార్డ్-ఆధార్ కార్డ్‌ లింక్ చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌లో ఇలా..

* రేషన్ కార్డ్ ఫోటోస్టాట్‌తో పాటు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డ్ ఫోటోస్టాట్ తీసుకోండి.

* మీ ఆధార్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయకపోతే, బ్యాంక్ పాస్‌బుక్ ఫోటోస్టాట్ కూడా తీసుకోండి.

* ఆ తరువాత, కుటుంబ యజమాని పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తీసుకొని దానిని రేషన్ కార్యాలయం లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) లేదా రేషన్ దుకాణంలో సమర్పించాలి.

* ఆధార్ డేటాబేస్ కోసం ఆ సమాచారాన్ని ధృవీకరించడానికి మీరు సెన్సార్‌పై వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.

* డిపార్ట్‌మెంట్ పత్రాలను స్వీకరించిన తర్వాత మీకు SMS లేదా ఇమెయిల్ ద్వారా లింక్ అయినట్లు తెలుస్తుంది.

* సంబంధిత అధికార యంత్రాంగం మీ పత్రాలతో తదుపరి ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత, రేషన్ కార్-ఆధార్ లింక్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories