Rupee Vs Dollar: మరింత పడిపోయిన రూపాయి మారకం విలువ

A further Depreciated Rupee Exchange Rate | Business News
x

Rupee Vs Dollar: మరింత పడిపోయిన రూపాయి మారకం విలువ

Highlights

Rupee Vs Dollar: అమెరికా డాలర్‌తో పోలిస్తే 83.08కు చేరిన రూపాయి విలువ

Rupee Vs Dollar: దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూపాయి మారకం విలువ అత్యంత కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 83.08కి చేరింది. ఇవాళ ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకపు విలువ 6 పైసలు పడిపోయి సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి 83.06కు చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి, FIIలు తరలిపోవడం, విదేశీ మారకం నిల్వల్లో తగ్గుదల దీనికి కారణమవుతోంది. వీటికితోడు వాణిజ్య లోటు పెరుగుదల, డాలర్‌కు డిమాండ్ పెరగడం కూడా రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి. రూపాయి పతనావస్థ ఇలాగే కొనసాగితే దేశంలో అనేక దిగుమతి ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ద్రవ్యోల్బణం కూడా మరింత పెరిగి ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories