Bank Holidays: ఆగస్టులో 13 రోజులు బ్యాంకులు బంద్‌.. పూర్తి జాబితా చెక్ చేయండి..!

13 Days Bank Holidays in August Check the Complete List Before Visiting the Branch
x

Bank Holidays: ఆగస్టులో 13 రోజులు బ్యాంకులు బంద్‌.. పూర్తి జాబితా చెక్ చేయండి..!

Highlights

Bank Holidays: మరో వారం రోజుల్లో ఆగస్ట్ నెల రాబోతోంది. ఈ నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Bank Holidays: మరో వారం రోజుల్లో ఆగస్ట్ నెల రాబోతోంది. ఈ నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2022 సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఆగస్టులో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. అందుకే సెలవులు ఏ రోజు ఉంటున్నాయో తెలిస్తే మిగతా రోజుల్లో బ్యాంకు పనులు పూర్తి చేసుకోవచ్చు.

ఆర్బీఐ సెలవులను మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంక్‌ల అకౌంట్లను క్లోజ్ చేయడం వంటివి ఉన్నాయి. అంటే జాతీయ సెలవుదినాలకు అదనంగా కొన్ని రాష్ట్ర-నిర్దిష్ట సెలవులు కూడా ఉన్నాయి. అన్ని ఆదివారాలు అలాగే నెలలో రెండో, నాలుగో శనివారాలు కూడా ఉంటాయి. అయితే ఆగస్టులో ఏయే రోజు బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం.

ఆగస్టులో బ్యాంకులకు సెలవులు

1. ఆగస్టు 1, 2022: గ్యాంగ్‌టక్‌లో ద్రుపక షీ-జీ పండుగ కారణంగా అన్ని బ్యాంకులు మూసివేస్తారు.

2. ఆగస్టు 7, 2022: ఆదివారం వారాంతం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

3. ఆగస్ట్ 8, 2022: మొహర్రం (ఆషురా) సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు మూసివేస్తారు.

4. ఆగస్ట్ 9, 2022: చండీగఢ్, డెహ్రాడూన్, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, పనాజీ, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం, శ్రీనగర్ మినహా మొహర్రం సందర్భంగా బ్యాంకులు మూసివేస్తారు.

5. ఆగస్టు 11, 2022: రక్షా బంధన్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

6. ఆగస్టు 13, 2022: నెలలో రెండో శనివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేస్తారు.

7. ఆగస్టు 14, 2022: ఆదివారం వారాంతం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

8. ఆగస్టు 15, 2022: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేస్తారు.

9. 16 ఆగస్టు 2022: పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా ముంబై, నాగ్‌పూర్‌లోని అన్ని బ్యాంకులు మూసివేస్తారు.

10. ఆగస్టు 18, 2022: జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేస్తారు.

11. ఆగస్టు 21, 2022: ఆదివారం వారాంతం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

12. 28 ఆగస్టు 2022 - వారాంతం కారణంగా ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

13. ఆగస్టు 31, 2022: గణేష్ చతుర్థి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories