Modi Govt: కొత్త బిజినెస్ కోసం రూ.1 కోటి రుణం కావాలా..అయితే మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీంలో ఎలా అప్లై చేయాలంటే..?

1 crore If you want a loan of apply in this scheme given by the Modi government
x

Modi Govt: కొత్త బిజినెస్ కోసం రూ.1 కోటి రుణం కావాలా..అయితే మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీంలో ఎలా అప్లై చేయాలంటే..?

Highlights

PM loan scheme for business: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకంగా వారి ఉపాధి కోసం అలాగే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా స్టాండ్ అప్ ఇండియా పేరిట పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అప్లై చేసుకోవడం ద్వారా ఒక కోటి రూపాయల రుణం వరకు పొందే అవకాశం ఉంటుంది.

PM loan scheme for business: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకంగా వారి ఉపాధి కోసం అలాగే పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా స్టాండ్ అప్ ఇండియా పేరిట పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అప్లై చేసుకోవడం ద్వారా ఒక కోటి రూపాయల రుణం వరకు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ముఖ్యంగా ఈ పథకం నిరుద్యోగ గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రవేశపెట్టారు.

దీంతో పాటు ఎవరైతే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపిస్తారో వారికి ప్రత్యేకంగా ఈ రుణాలను అందించనున్నారు. ఈ రుణం కోసం అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఇందుకు కావాల్సిన అర్హతలు. ఎలా అప్లై చేయాలి. ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. అలాగే ఈ రుణం ద్వారా ఎలాంటి పరిశ్రమలను స్థాపించవచ్చు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్టాండ్ అప్ ఇండియా పథకం గ్రీన్‌ఫీల్డ్ ఎంటర్‌ప్రైజ్ స్థాపన కోసం ఉద్దేశించిన పథకం. ఈ పథకం ద్వారా రుణం పొందాలంటే కనీసం ఒక షెడ్యూల్డ్ కులం (SC) లేదా షెడ్యూల్డ్ తెగ (ST)కు చెందిన రుణగ్రహీత, లేదా మహిళ మీ సంస్థలో 51 శాతం భాగస్వామిగా ఉండాలి. అప్పుడే మీకు ప్రభుత్వ బ్యాంకు శాఖ నుంచి 10 లక్షల నుండి 1 కోటి మధ్య రుణం లభిస్తుంది. అయితే సంస్థ పూర్తిగా లేదా 51 శాతం వాటా SC/ST లేదా మహిళా పారిశ్రామికవేత్తకు ఉండాలి.

అర్హత:

-SC/ST లేదా మహిళా పారిశ్రామికవేత్తలు;

- 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు

- ఈ పథకం కింద రుణాలు కేవలం గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ కోసం మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

-రుణం కోసం సంస్థలో 51% వాటా SC/ST లేదా మహిళా పారిశ్రామికవేత్తకు భాగం ఉండాలి

- రుణం పొందే వ్యక్తి గతంలో ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు డిఫాల్ట్‌గా ఉండకూడదు

ప్రయోజనాలు:

స్టాండ్ అప్ ఇండియా పథకం SC/ST వర్గాలకు చెందిన వారు లేదా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించడానికి అందిస్తుంది. ఈ స్కీం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తమ సొంత కాళ్లపై నిలబడేందుకు ఉద్దేశించారు. స్టాండ్ అప్ ఇండియా కోసం భారత ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. క్రెడిట్ సదుపాయాన్ని అందించడమే కాకుండా, స్టాండ్ అప్ ఇండియా రుణగ్రహీతలకు హ్యాండ్‌హోల్డింగ్ మద్దతును కూడా అందిస్తుంది.

పూర్తి వివరాల కోసం ఈ సైట్ క్లిక్ చేయండి. : https://www.startupindia.gov.in/

Show Full Article
Print Article
Next Story
More Stories